ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హడావిడి హాట్ హాట్ గా ఉంది.ఇలాంటి తరుణంలో సీఎం వైఎస్ జగన్ కి కోర్టు నోటీసులు రావటం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
మేటర్ లోకి వెళ్తే సీఎం జగన్ కి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు సమాన్లు జారీ చేయడం జరిగింది. 2014వ సంవత్సరంలో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై అనుమతిలేకుండా ఎన్నికల ప్రచారం నిర్వహించడం తో.ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించడం జరిగిందని కోర్టులో కేసు దాఖలైంది.
ఈ కేసులో వైఎస్ జగన్ ను ఏ1 గా ఉండటంతో మిగతా వారిపై కూడా కేసులు నమోదు చేయగా వారి పై ఉన్న కేసులు గతంలోనే కోర్టు కొట్టివేయడం జరిగింది.
అయితే ఈ విషయంలో ఇప్పటి వరకు జగన్ కోర్టుకు హాజరు కాకపోవటంతో, తాజాగా పోలీసులు చార్జిషీట్ దాఖలు చేయటం మాత్రమే కాక నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు జగన్ కి సమాన్లు జారీ చేసింది.ఖచ్చితంగా ఫిబ్రవరి 12వ తారీకున కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
