తెలంగాణ లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రోజులు గడుస్తున్నా ఇంకా పొత్తు చర్చలు ఒక కొలిక్కి రావడం లేదు , ఒక పక్క అదికార బారాస మనిఫెస్టో కూడా విడుదల చేసి బారి బహిరంగ సభలతో ప్రజా క్షత్రం లో దూసుకుపోతుంటే మరో పక్క కాంగ్రెస్ పార్టీతో కమ్యూనిస్టుల పొత్తు చర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి .ముఖ్యంగా కాంగ్రెస్( Congress Party ) బలంగా ఉన్న సీట్లను ఎర్రన్న లు పట్టుబట్టడంతో పొత్తు విషయంలో ప్రతిష్టంభన ఏర్పడినట్లుగా తెలుస్తుంది.
ప్రాథమికంగా సిపిఐ కు( CPI ) రెండు స్థానాలు సిపిఎం కి ( CPM ) రెండు స్థానాలు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.అయితే సిపిఐ కి ఇచ్చే స్థానాలు కొత్తగూడెం ,చెన్నూరు ఇప్పటికే ఖరారు అయ్యాయి.

సిపిఎంకు మిర్యాలగూడ ఒక స్థానం ఖరారవ్వగా రెండో స్థానం కోసం తీవ్ర తర్జనభజనలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది.పాలేరు( Paleru ) సీటు కోసం సిపిఎం గట్టిగా పట్టుపడుతుంది.అయితే ఇప్పటికే ఖమ్మం సీటు తుమ్మలకు,( Thummala Nageswara Rao ) పాలేరు సుధాకర్ రెడ్డికి( Sudhakar Reddy ) కాంగ్రెస్ కన్ఫామ్ చేసేసింది.ఈ ఇద్దరు నేతలు జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ను గట్టెక్కించే స్థాయిలో ఉండటంతో ఆ సీట్ల విషయంలో కాంగ్రెస్ మరో ఆలోచనకు తావు ఇవ్వడం లేదు.
వైరా స్థానాన్ని ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించగా సిపిఎం అందుకు అంగీకరించడం లేదు.

ఖమ్మం జిల్లాను( Khammam ) తమ కంచుకోటగా భావిస్తున్న కమ్యూనిస్టులు కచ్చితంగా ఒక సీట్లో పోటీ చేయాలని భావిస్తున్నారు దాంతో పొత్తు చర్చలు ఒక పొలిక్కి రావడం లేదు జరుగుతున్న పరిణామాలు ఇలాగే కంటిన్యూ అయితే ఇక ఎర్రని చూసుకోవడమే మంచిదని నిర్ణయానికి వస్తున్నట్లుగా తెలుస్తుంది కాంగ్రెస్ కూడా బలంగా ఉన్న స్థానాల్లో వదులుకోవడం కన్నా పొత్తును వదులుకోవడమే మంచిది అన్న భావంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే జాతీయస్థాయిలో ఇండియా కూటమిలో( India Alliance ) ఈ రెండు పార్టీలో భాగస్వాములు అవ్వడం వల్ల సాధ్యమైనంత ఈ సమస్యకు పరిష్కారాన్ని జాతీయస్థాయిలో చర్చించుకోవాలని రెండు పార్టీకి వచ్చినట్లుగా తెలుస్తుంది దాంతో మరో రెండు మూడు రోజుల్లో ఈ సీటుపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది
.






