దేశవ్యాప్తంగా మెజారిటీ హిందువుల మత విశ్వాసాలపై రాజకీయాలు చేసే భాజపాను ( BJP ) ఎదురుకోవడానికి దళితవాదమే సరైన ఆయుధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) భావిస్తున్నట్లుగా సమాచారం .మతపరమైన రాజకీయాలు చేసే భాజపాను దళితులను బహుజనులను ఐక్యం చేయడం ద్వారా ఎదుర్కోవచ్చని ఆయన భావిస్తున్నారని, అందుకే దళిత బహుజనులను ప్రసన్నం చేసుకోవడానికి అంబేద్కర్ 1225 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం కూడా కేంద్రం లో అధికారాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
సంఖ్యాపరంగా అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సంఘటితంగా లేని కారణంగానే దళితులు ( Dalits ) అధికారం పొందలేకపోతున్నారని ఇప్పటికే అనేక సార్లు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఈ విగ్రహ ఏర్పాటు ద్వారా తానే ముందుండి వారిని ఒక తాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.దళిత బంధు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ మాత్రమేనని దేశంలో ప్రతి ఏటా 25 లక్షల కుటుంబాలకు దళిత బంధు అమలు చేసే రోజు తొందరలో వస్తుందంటూ ఆయన చెప్పుకొచ్చారు.

రాజ్యాంగంలో అమలు లోకి వచ్చి 70 సంవత్సరాలు అయినా దళితులు అభివృద్ధి చెందలేదని, అంబేద్కర్ ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉందని చెప్పారు.కత్తి పద్మారావు సూచనల మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంబేద్కర్ అవార్డును ఇస్తామని దీనికోసం 51 కోట్ల రూపాయలతో నిదిని ఏర్పాటు చేస్తునామని ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ అవార్డును అందిస్తామని ఆయన తెలిపారు….ఎవరో అడిగారని ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని

ఆయన విశ్వ నరుడు కాబట్టే విశ్వరూపం ప్రతిష్టించుకున్నామని ఆయన తెలిపారు …….అంబేద్కర్ సిద్ధాంతాలు విశ్వజనీయము సార్వజనీయమని ఆయన కొనియాడారు .2024లో పార్లమెంటులో వచ్చేది తమ ప్రభుత్వం అన్ని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.దళిత బహుజనుల ఐక్యత అధికారాన్ని సాధించగలరని బలమైన అంచనాలు ఉన్నప్పటికీ వారి ఐక్యత దిశగా బలమైన పోరాటాలు మాత్రం జరగలేదు.
మరిప్పుడు కేసీఆర్ ఆ ప్రయత్నం ని సీరియస్ గానే చేస్తున్నట్లుగా అర్థమవుతుంది.ఆయన ఏ మేరకు విజయ
.






