సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమాతో మహేష్ తన కెరీర్ బెస్ట్ కలెక్షన్లు సాధించాడు.
ఇక ఈ సినిమా అందించిన సక్సెస్‌తో మహేష్ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాను వంశీ పైడిపల్లితో అనుకున్నా, అది సాధ్యం కాకపోవడంతో గీతాగోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమాను లాక్‌డౌన్ తరువాత ప్రారంభించేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు.అయితే ఎప్పటినుండో మహేష్ ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నాడు.కానీ సరైన కథ, సరైన డైరెక్టర్ దొరక్కపోవడంతో దాని ఊసెత్తలేదు.కాగా ఇప్పుడు పాన్ ఇండియా సినిమాకు మహేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
సౌత్ ఇండస్ట్రీ నుండి పాన్ ఇండియా మూవీగా కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్న ప్రశాంత్ నీల్, మహేష్‌కు ఓ అదిరిపోయే లైన్ వినిపించాడట.
ఈ సినిమాను పూర్తి స్క్రిప్టుగా రెడీ చేయాల్సిందిగా ప్రశాంత్ నీల్‌ను మహేష్ కోరాడట.
దీంతో మహేష్ కోరుకుంటున్న పాన్ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కించే సంకేతాలు మెండుగా కనిపిస్తున్నాయి.మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో చూడాలి.