సినీ ఇండస్ట్రీలోకి స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి హీరోగా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మంచు మనోజ్ (Manoj) ఒకరు.ఈయన గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు.
అయితే కొన్ని కారణాల వల్ల మనోజ్ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు కానీ ఈయన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం ఎంతో అద్భుతంగా కొనసాగిస్తున్నారని చెప్పాలి.ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా కూడా మనోజ్ వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
మనోజ్ గత ఏడాది మార్చి మూడవ తేదీ భూమా మౌనిక రెడ్డి( Bhuma Mounika Reddy ) ని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.భూమా మౌనిక రెడ్డి ఇదివరకే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చారు.అయితే వీరిద్దరికీ వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు.ఇక మనోజ్ కూడా ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు.పెళ్లి అయినటువంటి రెండు సంవత్సరాలకి వీరిద్దరు కూడా విడిపోయారు.
ఇలా ఒంటరిగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగిపోయింది.
ఇలా వీరిద్దరి వివాహం తర్వాత ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.ఇకపోతే మనోజ్ కొద్ది రోజుల క్రితం తాను తండ్రి కాబోతున్నాను అనే విషయాన్ని తెలియజేశారు.ఇలా మౌనిక ప్రెగ్నెన్సీ గురించి ఈయన ఎప్పటికప్పుడు అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇకపోతే ఇటీవల మనోజ్ కవల పిల్లలకు తండ్రి అయ్యారంటూ వార్తలు రాగా ఈ వార్తలను మనోజ్ కొట్టి పారేశారు.మౌనిక ప్రస్తుతం ఏడవ నెల గర్భంతో ఉందని తను చాలా సంతోషంగా ఆరోగ్యంతో ఉందని సోషల్ మీడియాలో ఆమె డెలివరీ అయ్యారంటూ వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని తెలిపారు.
ప్రస్తుతం ఏడవ నెల ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి బహుమా మౌనికకు ఘనంగా సాంప్రదాయపద్ధంగా నంద్యాలలో సీమంతపు ( Baby Shower) వేడుకలు చాలా ఘనంగా జరిగాయి.నంద్యాలలోని తమ బంధువుల సమక్షంలో ఈ వేడుకలు జరిగాయని తెలుస్తుంది.ఇందుకు సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది ఇటీవల భూమా మౌనిక తండ్రి దివంగత నేత భూమా నాగిరెడ్డి వర్ధంతి సందర్భంగా మనోజ్ మౌనిక నంద్యాలకు చేరుకున్నారు.
ఇలా ఈ దంపతులు భూమా నాగిరెడ్డికి నివాళులు అర్పించారు.
ఈ క్రమంలోనే నంద్యాల చేరుకున్నటువంటి ఈమెకు తన కుటుంబ సభ్యులు సీమంతపు వేడుకలను చేశారని తెలుస్తోంది.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు మీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.