కొప్పరపు కవుల కళాపీఠం 20వ వార్షికోత్సవం సింగీతం శ్రీనివాసరావుకి జాతీయ ప్రతిభా పురస్కారం ప్రధానం

విశాఖపట్నం సింహాచలం అవధాన కవి బ్రహ్మోత్సవం సందర్భము గా ప్రముఖ ఆసుకవి పద్య పితామహులు శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం 20 వ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి కళాభారతి లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను బుధవారం కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు మా శర్మ సింహాద్రి నాథుడు, శ్రీదేవి భూదేవి ,పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 Kopparapu Kavula Kalapeeth 20th Anniversary National Talent Award To Singeetham-TeluguStop.com

ఈ సందర్భంగా మా శర్మ మాట్లాడుతూ మూడేళ్లకు సంబంధించిన ప్రతిభా పురస్కారాలను ఈ యేడాది అందజేస్తున్నామన్నారు.ప్రధానంగా ప్రముఖ సంగీతదర్శకులు డాక్టర్ సింగీతం శ్రీనివాసరావు కు జాతీయ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం చేయనున్నట్లు తెలిపారు.

ఈ సభకు గరికిపాటి నరసింహారావు అధ్యక్షత వహించగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు నుంచి అవధానులు, ప్రముఖ సాహితీ వేత్తలు, కళాకారులు హాజరు కానున్నట్లు తెలిపారు.మాశర్మతో పాటు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు ,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి ,వైజాగ్ జర్నలిస్టు ల ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు తదితరులంతా ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయము వద్ద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కొప్పరపు కవులు కనకదుర్గ, ఆంజనేయస్వామి ఉపాసకులు అని ,ఏదైనా మనసులో సంకల్పిస్తే అది తప్పకుండా నెరవేరుతుందని శ్రీను బాబు తెలియజేశారు అటువంటి కార్యక్రమంలో ప్రతీ ఏటా తాను పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube