ప్రస్తుత రోజుల్లో మనం వాట్సాప్, టెలిగ్రామ్, ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ అంటూ ఎన్నో రకాల సోషల్ మీడియా యాప్స్ ని వినియోగిస్తున్న విషయం తెలిసిందే.ప్రతి ఇన్‌బాక్స్‌లోకీ వెళ్లి వాటిని చూడటానికి ఆ ఆప్‌లన్నింటినీ తెరవాల్సిందే.
అదే అన్నింటినీ ఒకేచోట చూసుకోగలిగితే ఎంత బాగుంటుందో.ఆ ఆలోచన ఎంతో బాగుంది కదూ.అలా అనుకునే ఆల్ ఇన్ వన్ ఆప్‌ను కనిపెట్టాడు కిషన్ బగారియా.( Kishan Bagaria ) అసోం రాజధాని దిస్‌పూర్‌కు( Dibrugarh ) 430 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిబ్రూగఢ్‌లోని ఒక మధ్యతరగతి కుటుంబం కిషన్ ది.తండ్రి మహేంద్ర చిరు వ్యాపారి.అతని తల్లి కవితకు కొడుకును బాగా చదివించాలని ఉండేది.
కిషన్‌కి మాత్రం చదువు అంటే ఆసక్తి ఉండేది కాదు.ఎప్పుడూ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు చదివేవాడు.
పన్నెండేళ్లకే వీడియో గేములు తయారు చేసిన ఎలన్ మస్క్, చదువుకుంటూనే ఫేస్‌బుక్‌ను సృష్టించిన మార్క్ జుకర్ బర్గ్‌లని ఆదర్శంగా తీసుకుని తను కూడా అలా ఏదైనా చేయాలనుకునేవాడు.కానీ అతని మాటల్ని ఎవరూ పట్టించుకునే వారు కాదు.
కిషన్ ఏడో తరగతి చదువుతున్న సమయంలో అనగా 2010లో ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది.అది కాస్త ఖరీదైన వ్యవహారమే అయినా పిల్లల కోసమని వాళ్ళ నాన్న కంప్యూటర్( Computer ) కొని వైఫై పెట్టించాడు.
కిషన్ గంటలు గంటలు కంప్యూటర్ ముందు కూర్చునేవాడు.ఎప్పుడూ ఆ కంప్యూటర్‌తోనేనా? అదేమన్నా తిండి పెడుతుందా’ అంటూ తరచూ అమ్మానాన్నలు కిషన్‌ను కోప్పడేవారు.ఇక పదో తరగతి పూర్తయ్యాక తన తోటి వారంతా ఇంటర్‌లో చేరుతుంటే కిషన్‌కి ఆ ఆలోచనే ఉండేది కాదు.
తల్లిదండ్రులు బలవంత పెడుతుంటే ఒక రోజు చదువుకోవడం ఇష్టం లేదంటూ మనసులోని మాట చెప్పేసాడు.కొడుకు మాటల్ని వారు జీర్ణించుకోలేక ఎలాగైనా నచ్చజెప్పి కాలేజీకి పంపాలనుకున్నారు.కిషన్ మాత్రం కంప్యూటర్ గదినే కాలేజీగా భావించాడు.
ఆన్‌లైన్‌లో రకరకాల కోర్సులు నేర్చుకునేవాడు.కొడుకు కాలేజీకి వెళ్లట్లేదన్న బాధ ఉన్నా అతను చేసేవి చూస్తుంటే తల్లిదండ్రులకు ముచ్చటేసేది.
ఇంజినీరింగ్ చదివే అన్నయ్య క్లాస్ సబ్జెక్టులకు సంబంధించిన కొత్త కొత్త విషయాలు చెబుతూ సందేహాలు తీర్చుతుంటే ఆశ్చర్యపోయేవారు.క్రమంగా కొడుకు మనసును అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు.
ఆ ఉత్సాహంతో ఏవో చిన్న చిన్న ఆప్‌లను ( Apps ) రూపొందించేవాడు కిషన్.కరోనా సమయంలో( Corona ) దేశవిదేశాల్లో స్థిరపడ్డ స్నేహితులతో తరచూ మాట్లాడేవాడు.
వారు టెక్నాలజీకి సంబంధించిన విషయాలెన్నో కిషన్‌తో పంచుకునేవారు.
అప్పుడే ఫోన్‌లో రకరకాల మెసేజింగ్ ఆప్‌లు( Messaging Apps ) అన్నింటినీ తెరిచి చూడటం కష్టమవుతుందన్న స్నేహితుల మాట బుర్రలో నాటుకుంది.ప్రతి యాప్ నీ తెరిచే బదులు అన్నీ ఒకే చోట ఓపెన్ అయితే ఎలా ఉంటుందని ఆలోచించి- 2020లో ఆల్ ఇన్ వన్ ఆప్‌ను రూపొందించడం మొదలుపెట్టాడు.దానికి టెక్ట్స్.కామ్( Texts.com ) అనే పేరు పెట్టి దాదాపు రెండేళ్లు కష్టపడి రూపకల్పన చేశాడు.తను వాడాక స్నేహితులనీ ఉపయోగించి చెప్పమన్నాడు.వారికీ బాగా నచ్చడంతో తాము పనిచేసే సంస్థల్లోని ఉద్యోగులకీ పరిచయం చేయడంతో పాటు, తమ స్నేహితుడిని ప్రోత్సహించాలనుకుని అమెరికాకు ఆహ్వానించారు.ఈ ఏడాది తొలినాళ్లలో శాన్‌ఫ్రాన్సిస్కోకి( Sanfrancisco ) వెళ్లిన కిషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో తన ఆప్ గురించి డెమో ఇవ్వడం మొదలుపెట్టాడు.
దాదాపు వందకుపైగా సంస్థలకు వెళ్లాడు.ఆ క్రమంలో ఆగస్టులో ఆటోమేటిక్ కంపెనీ అధినేత మ్యాట్ ములెన్‌వెగ్‌ని( Matt Mullengweg ) కలిసి డెమో ఇచ్చాడు.రాబోయే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వాడుకలోకి వచ్చే సత్తా టెక్ట్స్.కామ్‌కి ఉందనుకున్నాడు మ్యాట్.
అలా దాదాపు మూడు నెలల పాటు పలు చర్చలు జరిపి ఆ ఆప్‌ను దాదాపు రూ.416 కోట్లకు కొనడానికి ముందుకొచ్చాడు.అలా దాన్ని కొనుగోలు చేయడంతో పాటు టెక్ట్స్.కామ్ విభాగానికి కిషన్‌నే హెడ్‌గా నియమించాడు.ఆ చర్చలు జరిగిన మూడు నెలలూ కిషన్ కంటి మీద కునుకు లేదు.ఆప్‌ను తీసుకుంటారో లేదోనని ఒత్తిడికి గురయ్యాడు.
తన ఆప్‌కి అంత మొత్తంలో డబ్బు ఇస్తున్నారంటే నమ్మలేకపోయాడట.ఇంతకీ ఈ ఆప్ ప్రత్యేకతలు ఏంటంటే.
ఏ భాషలో మెసేజ్ టైప్ చేసినా ఏఐ సాయంతో ఇంగ్లిష్‌లోకి దానంతటదే అనువాదమవుతుంది.టైమ్ షెడ్యూల్ ముందే పెట్టేసి దాని ప్రకారం మెసేజ్‌లు వెళ్లిపోయేలా చూసుకోవచ్చు.
చాటింగ్‌ను సమ్మరైజ్ చేసి చూసుకోవచ్చు.