తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం లో పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా పోలీసులకు, ప్రజలకు, అధికారులకు తెలంగాణ రాష్ట్ర అవతరణ, దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా పాత పోలీస్ కమిషనర్ (DPO) కార్యాలయంలో అడీషనల్ డీసీపీ లా&ఆర్డర్ సుభాష్ చంద్ర బోస్, పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో అడీషనల్ డీసీపీ కుమారస్వామి జాతీయ పతాకావిష్కరణ చేశారు.
కార్యక్రమంలో ట్రైనీ ఏఎస్పీ అవినాష్ కుమార్, ఏసీపీలు రామోజీ రమేష్ , ప్రసన్న కుమార్, గణేష్, భస్వారెడ్డి, రహెమాన్, వేంకటేశ్వర్లు, వెంకటస్వామి,AO అక్తరూనీసాబేగం తదితరులు పాల్గొన్నారు.