పెండింగ్ బిల్లులపై తెలంగాణ గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు.అసెంబ్లీలో పాసైన బిల్లులకు ఆమోదం తెలిపే అంశం తన పరిధిలోనిది అన్నారు.
ఈ నేపథ్యంలో పెండింగ్ లో ఉన్న బిల్లులను త్వరలో పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు.గవర్నర్ గా తనకు విస్తృత అధికారాలు ఉంటాయన్న తమిళి సై.తన పరిధికి లోబడే నడుచుకుంటున్నట్లు వెల్లడించారు.తను ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
గవర్నర్ గా నిర్ణయాలు వెలువరిస్తానని తమిళిసై పేర్కొన్నారు.