తాప్సీతో దీవాలి సంబరాలు అంటూ మంచు లక్ష్మి పోస్ట్.. రియా చక్రవర్తి కామెంట్!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సినీ నటి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి అందరికీ తెలిసిందే.మంచు ఫ్యామిలీ నుండి తొలి హీరోయిన్ గా పరిచయమైంది లక్ష్మి.

 Manchu Lakshmis Post Saying Diwali Celebrations With Taapsee Rhea Chakrabortys C-TeluguStop.com

అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టింది.

సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.లక్ష్మి తొలిసారిగా ఇండస్ట్రీకి ఇంగ్లీష్ సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో పరిచయం అయింది.ఆ తర్వాత పలు సినిమాలలో కూడా నటించింది.

హిందీలో కూడా ఓ సినిమాలో నటించింది.

కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అంతగా అవకాశాలు అందుకోలేకపోయింది.ఇక ఇంగ్లీష్ టీవీ సీరియల్స్ లో కూడా నటించింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెరపై పలు షో లల్లో వ్యాఖ్యాతగా చేసింది.ఇక ఆ మధ్య ఆహా లో కూడా ఆహా భోజనంబు అనే వంటల ప్రోగ్రాం లో కూడా హోస్టింగ్ చేసింది.

ఇక ఈమధ్య బాగా వర్కౌట్ లపై బాగా శ్రద్ధ పెట్టింది.పైగా బాగా ఆసనాలు కూడా చేస్తుంది మంచు లక్ష్మి.

వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ కు బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కాసేపు ముచ్చట్లు పెడుతుంది.ఇక తనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన కూతురు కి సంబంధించిన విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.

అలా తన ఫ్యామిలీ గురించే కాకుండా సమాజంలో జరిగే కొన్ని విషయాల గురించి కూడా పంచుకుంటుంది.ఇటీవలే తన పేరు మీద యూట్యూబ్ ఛానల్ కూడా లాంచ్ చేయగా అందులో తన హోమ్ టూర్ వీడియోలు కూడా చూయించింది.అలా సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరలో ఉంది.

అప్పుడప్పుడు వెండితెరపై జరిగే ఈవెంట్లలో కూడా పాల్గొంటుంది మంచు లక్ష్మి.

ఇదంతా పక్కన పెడితే ఈరోజు దీపావళి పండగ సందర్భంగా మంచు లక్ష్మి హీరోయిన్ తాప్సీ తో సందడి చేసినట్లు కనిపించింది.దీంతో దానికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా షేర్ చేసుకుంది మంచు లక్ష్మి.

అయితే ఆ పోస్టుకు చాలామంది సెలబ్రెటీలు వెంటనే స్పందించగా.అందులో రియా చక్రవర్తి కూడా ఒకరు.

దీంతో రియా చక్రవర్తి కూడా ఆ పోస్టుకి స్పందించడంతో నెటిజన్స్ మంచు లక్ష్మీపై ఫైర్ అవుతున్నారు.ఎందుకంటే రియా చక్రవర్తి గురించి అందరికీ తెలిసిందే.గతంలో సుశాంత్ చనిపోవడానికి కారణం ఈమెనే టాక్ వచ్చింది.అయితే ఈమెకు గతంలో నుండి మంచు లక్ష్మితో మంచి పరిచయం ఉందని తెలిసింది.

కానీ మంచు లక్ష్మి ఈ విషయం గురించి తనకు తెలియదు అన్నట్లుగా ఊరుకుంది.అయితే తను షేర్ చేసుకున్న పోస్ట్ కి తాజాగా రియా చక్రవర్తి స్పందించడంతో ఈమెకు అలాంటి వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ ఉంటుంది అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube