తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని రాజీనామా..!!

విజయవాడ ఎంపీ కేశినేని నాని( MP Kesineni Nani ) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.టీడీపీ పార్టీకి సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

 Keshineni Nani Resigns From Telugu Desam Party Tdp, Ysrcp, Keshineni Nani-TeluguStop.com

తన రాజీనామా లేఖను టీడీపీ చీఫ్ చంద్రబాబుకి పంపించినట్లు ట్వీట్ చేశారు.ఇన్నాళ్ళు పార్టీలో  తనకు మద్దతుగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

కేశినేని నాని ఇప్పటికే తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.తన రాజీనామాను లోక్ సభ స్పీకర్ ఓం బీర్లకు మెయిల్ ద్వారా పంపించారు.

స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసిన కేశినేని నాని.తక్షణమే తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉంటే నేడు వైసీపీ అధినేత సీఎం జగన్( YCP YS Jagan ) ని కేశినేని నాని కలవడం జరిగింది.ఈ భేటీ అనంతరం తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు, లోకేష్ పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

పార్టీ కోసం తాను ఎంతగానో కష్టపడినట్లు కానీ సరైన మర్యాద ఇవ్వలేదని ఆరోపించారు.తనకు వ్యతిరేకంగానే పార్టీలో నాయకులను పార్టీ పెద్దలు లేపారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికలలో పోటీకి సంబంధించి ఏనాడు కూడా టికెట్ ఇవ్వాలని తాను అడుకోలేదని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో వైఎస్ జగన్ పాలన పై పొగడ్తల వర్షం కురిపించారు.పేదల పక్షపాతి అని.త్వరలోనే వైసీపీ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు కేశినేని నాని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube