తల్లి పనిమనిషి.. కొడుకు ఐఏఎస్.. ఈ వ్యక్తి సక్సెస్ స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే!

జీవితంలో ఏదైనా పనిలో విజయం సాధించాలంటే ఎంతో కష్టపడాలి.ఆత్మస్థైర్యం, ధైర్యం ఉంటే మాత్రమే కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడం సాధ్యమవుతుంది.

 Kerala Ias Officer B Abdul Nasar Inspirational Success Story Details, Kerala Ias-TeluguStop.com

యూపీఎస్సీ పరీక్షలో( UPSC Exam ) రాణించాలంటే కృషి, పట్టుదల ఉండాలనే సంగతి తెలిసిందే.యూపీఎస్సీ పరీక్ష దేశంలో అతిపెద్ద పరీక్ష కాగా ఈ పరీక్షలో విజయం సాధించడం సులువైన విషయం కాదు.

అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించిన వాళ్లలో అబ్దుల్ నసర్( Abdul Nasar ) ఒకరు.

కేరళ రాష్ట్రంలోని( Kerala ) కన్నూర్ కు చెందిన అబ్దుల్ నసర్ పుట్టిన ఐదేళ్లకే తండ్రిని కోల్పోయాడు.

తల్లి ఇతర ఇళ్లలో పని చేసి కుటుంబానికి సహాయం చేసేది.అబ్దుల్ సైతం పదేళ్ల వయస్సులోనే చిన్నచిన్న పనులు చేస్తూ సహాయసహకారాలు అందించేవారు.ఎన్ని ఇబ్బందులు ఎదురైన అబ్దుల్ నసర్ తలస్సేరి ప్రభుత్వ కళాశాలలో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేయడం జరిగింది.

Telugu Abdul Nasar, Ias Abdul Nasar, Iasabdul, Ias Story, Kannur, Kerala, Kerala

అబ్దుల్ పీజీ పూర్తి చేసిన తర్వాత కేరళ ఆరోగ్య శాఖలో( Kerala Health Department ) ప్రభుత్వ ఉద్యోగిగా చేరి తన లైఫ్ ను మొదలుపెట్టారు.1994లోనే యూపీఎస్సీ ఉద్యోగం సాధించిన అబ్దుల్ 2006 సంవత్సరంలో రాష్ట్ర సివిల్ సర్వీస్ లో డిప్యూటీ కలెక్టర్ గా( Deputy Collector ) పదవి పొందారు.2015 సంవత్సరంలో అబ్దుల్ కేరళలో టాప్ డిప్యూటీ కలెక్టర్ గా విజయాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.2017లో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ గా( IAS Officer ) పదోన్నతి పొందారు.

Telugu Abdul Nasar, Ias Abdul Nasar, Iasabdul, Ias Story, Kannur, Kerala, Kerala

యూపీఎస్సీ పరీక్షలో సక్సెస్ సాధించిన అబ్దుల్ నసర్ తన సక్సెస్ స్టోరీతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.అబ్దుల్ టాలెంట్ ను ఎంత ప్రశంసించినా తక్కువేనని నెటిజన్లు చెబుతున్నారు.బాల్యంలో కొంతకాలం అనాథాశ్రమంలో ఉండి అబ్దుల్ నసర్ ఎన్నో కష్టాలను అధిగమించి ఈ స్థాయికి చేరుకోవడం జరిగింది.

కొడుకుతో పాటు పిల్లలను ప్రయోజకులను చేసిన అబ్దుల్ నసర్ తల్లిని సైతం నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube