ఏకంగా ఐదుగురు హీరోలతో కత్రినా కైఫ్ సీక్రెట్ లవ్ గేమ్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది.ముఖ్యంగా యువత ఫేవరెట్ హీరోయిన్ అయిన ఈ భామ 41 ఏళ్ల వయస్సులోనూ ఫిట్ నెస్‌పైన కాన్సంట్రేట్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.

 Katina Kaif Secret Love Games With Star Heros Details, Katrina Kaif, Katrina Kai-TeluguStop.com

ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా అందంగా మారుతూ ఆకట్టుకుంటుంది.

కత్రినా కైఫ్ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది.

వెంకటేశ్, బాలకృష్ణ కథనాయకులుగా తెరకెక్కిన సినిమాల్లో ఈ భామ హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది.ఈ సంగతులు పక్కనబెడితే.

వచ్చే నెల 9న కత్రినా కైఫ్ యంగ్ హీరో విక్కీ కౌశల్‌ను రాజస్థాన్‌లో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ కూడా పూర్తయిందని నెట్టింట వార్తలు హల్ చల్ అవుతున్నాయి.

అయితే, ఈ విషయమై విక్కీ కౌశల్ కాని కత్రినా కైఫ్ కాని అఫీషియల్‌గా ఎటువంటి అనౌన్స్‌మెంట్ చేయలేదు.కానీ, మీడియా మాత్రం కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ జంటగా మారబోతున్నారని గట్టిగానే ప్రచారం చేస్తోంది.

ఇకపోతే కత్రినా కైఫ్ లవ్ స్టోరిస్ గురించి బీ టౌన్‌లో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

కత్రినా ఫస్ట్ లవ్ చేసింది బాలీవుడ్ మెగా స్టార్ సల్మాన్ ఖాన్‌ నేనట.

Telugu Akshay Kumar, Ranbir Kapoor, Vicky Koushal, Katrina Kaif, Katrinakaif, Si

సల్మాన్ సైతం కత్రినతో ప్రేమాయణం కొన్నాళ్ల పాటు జరిపాక, వీరి మధ్య బ్రేకప్ జరిగిందని టాక్.ఆ తర్వాత కత్రినా కైఫ్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా సన్ సిద్ధార్థ్ మాల్యాతో డేటింగ్‌లో ఉందని వార్తలొచ్చాయి.సిద్ధార్థ్ – కత్రినా కైఫ్ పలు ప్రైవేట్ పార్టీల్లో కనిపించడంతో ఈ వార్తను చాలా మంది కన్ఫర్మ్ చేశారు.కానీ, ఆ తర్వాత స్టెప్ అయితే పడలేదు.

ఆ తర్వాత బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో కత్రినా కైఫ్ ప్రేమలో ఉందని, కొన్నాళ్ల పాటు సీరియస్ లవ్‌లో ఉన్న తర్వాత వీరు కూడా విడిపోయారనే ప్రచారం సాగింది.

Telugu Akshay Kumar, Ranbir Kapoor, Vicky Koushal, Katrina Kaif, Katrinakaif, Si

బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్‌తోనూ కత్రినా కైఫ్ లవ్ స్టోరి నడిపిందని వార్తొలొచ్చాయి.కానీ, అది నిజం అని ప్రూవ్ కాలేదు.మొత్తంగా కత్రినా కైఫ్ ఇంత మంది హీరోలతో లవ్ స్టోరిలు నడిపినట్లు వార్తలొచ్చినప్పటికీ ఏనాడు కూడ స్పందించలేదు.

కాగా తాజాగా విక్కీ కౌశల్‌తో లవ్ స్టోరి కాస్తా మ్యారేజ్‌గా మారుతుందన్న ప్రచారంలో నిజం ఉందా లేదా తెలియాలంటే ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube