చిరు టైటిల్ పెట్టుకునే స్థాయి నాకు ఉందని అనుకోవడం లేదు: కార్తికేయ

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన కార్తీకేయ తన నటనతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయ మయ్యి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు.నటన, అందం, డాన్స్ పరంగా కూడా సూపర్ అనిపించుకోవడంతో ఈ యంగ్ హీరోకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం కార్తికేయ ‘రాజా విక్రమార్క‘ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అయ్యాడు.

 Karthikeya In Raja Vikramarka Movie Pre Release Event, Karthikeya, Raja Vikramar-TeluguStop.com

శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాను ఇన్వెస్టిగేషన్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా ఈ నెల 12న థియేటర్స్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా నిర్వహించారు.

ఈ వేదికపై కార్తికేయ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

కార్తికేయ మాట్లాడుతూ రాజా విక్రమార్క అనగానే ముందుగా చిరంజీవి గారి టైటిల్ నే గుర్తుకు వస్తుంది.

రాజా విక్రమార్క టైటిల్ చిరంజీవి గారిదే.చిరంజీవి టైటిల్ ను పెట్టుకునే స్థాయి నాకు ఉందని నేను అనుకోవడం లేదు.

కానీ నాకు చిన్నప్పటి నుండి చిరు గారి ఏ సినిమా చుసిన అందులో నన్ను నేను ఊహించుకుంటూ పెరిగాను.గ్యాంగ్ లీడర్ సినిమా చూసినప్పుడు నెం గ్యాంగ్ లీడర్ అనుకున్నాను.

Telugu Chiranjeevi, Karthikeya, Karthikeyaraja, Raja Vikramarka, Tollywood-Movie

ఇంద్ర చూసినప్పుడు నేనే ఇంద్ర అనుకున్నాను.ఠాగూర్ చూసినప్పుడు నన్ను నేనే ఠాగూర్ అనుకునే వాడిని.ఆయన పట్ల గల అభిమానానికి మించిన అర్హత ఏముంటుందని ఈ టైటిల్ పెట్టుకున్నాను.ఇంతవరకు నేను చేసిన సినిమాలకు సొంతంగా నను నేను టైటిల్ పెట్టుకున్న సినిమా ఇదే.అని కార్తికేయ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడారు.మరి చూడాలి కార్తికేయ కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube