కరణం బలరామకృష్ణమూర్తి.టీడీపీలో సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన నాయకుడు.
ప్రకాశం జిల్లాలో ఆయన దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించారు.అలాంటి నాయకుడు అనేక ఎదురు దెబ్బలు తిన్నా కూడా టీడీపీలోనే ఉన్నారు.2014 ఎన్నికల్లోనే ఆయన తన వారసుడు వెంకటేష్‌ను టీడీపీ నుంచి పోటీ చేయించినా గెలిపించుకోలేకపోయారు.కట్ చేస్తే గత ఎన్నికల్లో తిరిగి ఆయనే పోటీ చేయాల్సిన పరిస్థితి.
గత ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన కరణం తర్వాత వైసీపీ కండువా కప్పుకొన్నారు (టెక్నికల్ కాకపోయినా).మరి ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో పూర్తిగా ఇమిడిపోయారా ? అనేది సందేహం.
అంతేకాదు.సుదీర్ఘ కాలంగా ప్రయాణించిన టీడీపీని అంత తేలికగా వదిలేసుకుంటారా ? అంతేకాదు.టీడీపీ అనేక సంవత్సరాలు ఆయనను భరించింది.ఆయన ద్వారా ఎంతో మంది నాయకులను డవలప్ చేసుకుంది. మరి ఆ పార్టీ కూడా కరణంను తేలికగా వదిలేసుకుంటుందా ? అనేది సందేహం.ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్లేషకులు చెబుతున్న మాట.
కరణం.పార్టీ మారి వైసీపీలోకి చేరినా.
ఆయనకు వైసీపీ కేడర్ దగ్గర కాలేదని.కేడర్‌లో ఆయన పట్టు సాధించలేదని అంటున్నారు.
కరణం వైసీపీ చెంత చేరి ఇప్పటికే దాదాపు ఏడాది అయింది.అయినా ఇప్పటకీ ఆయన ఇప్పటి వరకు వైసీపీ కేడర్‌తో ఒక్కసారి కూడా భేటీ అయింది లేదు.

పైగా ఏదైనా సమావేశం ఉంటే.టీడీపీ నుంచి వచ్చిన వారితోనే భేటీ నిర్వహిస్తున్నారు.అంతేతప్ప.సంస్థాగతంగా వైసీపీలో ఉన్న కేడర్‌ను ఓన్ చేసుకోవడంలో కరణం పూర్తిగా విఫలమయ్యారు. ఇది విఫలం అనేకన్నా.వ్యూహాత్మకంగా చేస్తున్న వ్యవహారమేనని అంటున్నారు.
ఆయన కేవలం తన అవసరాలు, వ్యాపారాలు.గత కేసుల నేపథ్యంలోనే వైసీపీలోకి చేరువ అయ్యారని.
అందుకే కేడర్ తో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు.ఇప్పటి వరకు వైసీపీ కేడర్‌ను ఆయన పట్టించుకోకపోవడం.
ఎమ్మెల్యే అయి ఉండి.వైసీపీని నడిపించడంలోనూ ఆయన పట్టించుకోకపోవడం వంటివి చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల అద్దంకి నియోజకవర్గంలో 20 పంచాయతీల్లో కరణం వర్గీయులే గెలిచారు.వీటిని అక్కడ ఇన్చార్జ్ బాచిన కృష్ణ చైతన్య వైసీపీ ఖాతాలో వేసుకుంటున్నారు.అయితే వీరంతా బాచిన వర్గంగా కంటే కరణం వర్గంగానే ఉన్నారు.రేపటి రోజు వీరంతా కరణం మళ్లీ టీడీపీకి వచ్చినా లేదా ఆయన అద్దంకిలో వైసీపీ నుంచి పోటీ చేసినా ఆయన వెంటే నడుస్తామని చెపుతున్నారు.
ఆయన చీరాలలో ఉన్నా ఇటు అద్దంకిలో ఉన్నా.రేపు తాను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తన వెంట వచ్చేలా కేడర్‌ను ఆయన సమాయత్తం చేసుకుంటున్నారు.
దీనిని బట్టి.కరణం.
తన అవసరాల కోసం వైసీపీకి చేరువైనా.వైసీపీ నిజమైన కేడర్ మాత్రం ఆయనను చేరువ కాలేక పోయిందనే స్పష్టంగా తెలుస్తోంది.