జగన్ నాలుగేళ్ల పాలన శాపం అంటూ కన్నా లక్ష్మీనారాయణ సీరియస్ కామెంట్స్..!!

టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ జగన్ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జగన్ నాలుగు సంవత్సరాల పాలన రాష్ట్రానికి శాపంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్ర ప్రదేశ్ గా మార్చేశారని.పరువు తీస్తున్నారని విమర్శించారు.

ఇసుక, మద్యం, ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు.CPS రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ఉద్యోగస్తూలను మోసం చేశారని విమర్శించారు.

మద్యపానం నిషేధ హామీ ఏమైంది అంటూ నిలదీశారు.

Telugu Ys Jagan-Telugu Political News

25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఆనాడు మాట ఇచ్చారు.కేసుల కారణంగా రాజీపడి రాష్ట్ర హోదాను తీసుకురాలేదని కీలక వ్యాఖ్యలు చేశారు.జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.

పేదల ఇళ్ళ కోసం భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.తెచ్చిన అప్పులలో రెండు లక్షల కోట్లు సంక్షేమానికి ఉపయోగిస్తే మిగతావి వైసీపీ నాయకులు దోచేశారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు అయిన కట్టారా అంటూ.జగన్ నాలుగేళ్ల పాలనపై కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube