రూ.250 కోట్లు పెట్టి డైలీ సీరియల్ తీశావు బుద్ది ఉందా...?

రణవీర్ సింగ్( Ranveer Singh ) అలియా భట్( Alia bhat )జంటగా కరణ్ జొహార్ దర్శకత్వం లో ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ అనే సినిమా రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఒకప్పుడు సూపర్‌ హిట్ చిత్రాల దర్శకుడిగా పేరున్న కరణ్ జోహార్ చాలా సంవత్సరాల తర్వాత దర్శకత్వం చేశాడు.

 Kangana Ranaut Comments On Karan Johar's Film Rocky Aur Rani Ki Prem Kahani, Kan-TeluguStop.com

ఆ మధ్య వెబ్‌ సిరీస్ ల్లో ఒక్క ఎపిసోడ్‌ కు దర్శకత్వం వహించిన కరణ్ ఈసారి ఫుల్‌ లెంగ్త్‌ సినిమాకు దర్శకత్వం వహించడం జరిగింది.ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో వస్తున్న సినిమా లన్నీ కూడా బొక్క బోర్లా పడుతున్నాయి.

Telugu Alia Bhat, Kangana Ranaut, Karan Johar, Ranveer Singh, Rockyaur-Movie

దాంతో కరణ్ జోహార్‌( Karan Johar ) తాను తోపును.తనను మించిన వారు లేరు అన్నట్లుగా ఈ సినిమా ను ఏకంగా రూ.250 కోట్ల బడ్జెట్‌ తో నిర్మించడం జరిగింది.సినిమా ఇటీవలే విడుదల అయింది. రూ.250 కోట్లు ఏమో కానీ పై రూ.50 కోట్లు అయినా వసూళ్లు సాధిస్తుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా తో కరణ్ జోహార్‌ తన స్టార్‌ ఫిల్మ్‌ మేకర్ అనే హోదా కోల్పోయాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

కరణ్ జోహార్‌ గురించి ఎప్పుడు సందు దొరుకుతుందా కుమ్మేద్దామా అని ఎదురు చూస్తున్న కంగనా రనౌత్ వెంటనే రియాక్ట్‌ అయింది.ఈ సినిమా పై కంగనా తీవ్ర స్థాయి లో విమర్శలు చేసింది.

కరణ్ జోహార్ దర్శకత్వం చెత్తగా ఉందని విమర్శించడంతో పాటు సినిమా లో రణవీర్ సింగ్ ధరించిన కాస్ట్యూమ్స్ ప్రస్తుతం ఎవరైనా వేసుకుంటారా అంటూ విమర్శించింది.

Telugu Alia Bhat, Kangana Ranaut, Karan Johar, Ranveer Singh, Rockyaur-Movie

రూ.250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక డైలీ సీరియల్‌ వంటి చెత్త సినిమా ను కరణ్ జోహార్ తీశాడు అంటూ కంగనా( Kangana ) ఆరోపించింది.90వ దశకంలో కరణ్ రూపొందించిన సినిమా నే కాపీ కొట్టినట్లుగా ఈ సినిమా ను రూపొందించాడు.కొత్తగా ఏమీ లేదు.అప్పుడు తీసినట్లుగా సినిమా లు తీస్తే ఇప్పుడు నడవదు అని ఈ ఫలితం తో కరణ్ జోహార్ కి అర్థం అయ్యి ఉంటుంది అంటూ కంగనా ఎద్దేవ చేసింది.

అంత భారీ బడ్జెట్‌ తో ఇలాంటి చెత్త సినిమా చేయడానికి సిగ్గు ఉండాలి అంటూ నిర్మొహమాటంగా తీవ్ర పదజాలంతో కంగనా కరణ్‌ జోహార్‌ పై విమర్శలు చేయడం వైరల్‌ అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube