టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో కళ్యాణ్ రామ్ ( Kalyan ram )ఒకరు.మరికొన్ని రోజుల్లో కళ్యాణ్ రామ్ డెవిల్( Devil ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఈ సినిమాకు ప్రమోషన్స్ లో వేగం పెరగాల్సి ఉంది.సంయుక్త మీనన్ నటించిన సినిమాలన్నీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో డెవిల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
డెవిల్ సినిమాలో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనుండగా దిల్ రాజు ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్నారు.డెవిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.
పలు వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఆ వివాదాల నుంచి బయటపడి థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ తన సినిమాలలో మెజారిటీ సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరించారు.

అయితే కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన అవమానాల గురించి కళ్యాణ్ రామ్ సుమ అడ్డా షోలో చెప్పుకొచ్చారు.సుమ అడ్డా షోకు డెవిల్ టీం హాజరయ్యారు.కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ ఈ షోలో సందడి చేశారు.నేను నటించిన తొలి చూపులోనే, అభిమన్యు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదని ఆ సమయంలో చాలామంది నిరుత్సాహానికి గురి చేశారని పేర్కొన్నారు.

నీకు యాక్టింగ్ అవసరమా వెళ్లిపో అని అన్నారని కళ్యాణ్ రామ్ ( Kalyan ram )అన్నారు.మా నాన్న హరికృష్ణ మాత్రం ఆ సమయంలో ఎంతో ప్రోత్సహించారని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించడానికి కారణం అని కళ్యాణ్ రామ్ వెల్లడించారు.కళ్యాణ్ రామ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో( Social media ) వైరల్ అవుతున్నాయి.కళ్యాణ్ రామ్ పారితోషికం ప్రస్తుతం 10 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.