టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ ‘మోసగాళ్లు’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేస్తూ వస్తోంది.తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవ్వడంతో మోసగాళ్లు చిత్రం గురించిన పలు ఆసక్తికరమైన విషయాలను చిత్ర యూనిట్ ప్రేక్షకులతో పంచుకుంటోంది.
ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను ఫుల్ స్వింగ్‌లో నిర్వహిస్తున్న మంచు విష్ణు, ఈ సినిమాలోని నటీనటుల విషయంలో కూడా మంచు విష్ణు పలు ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈ సినిమాలో నటిస్తున్న అందాల భామ కాజల్ పాత్రకు సంబంధించి విష్ణు ఓ సీక్రెట్‌ను రివీల్ చేశాడు.
ఈ సినిమాలో తనకు సోదరి పాత్రలో కాజల్ నటిస్తుందని, అయితే ఈ పాత్రకు తొలుత కాజల్‌ను తీసుకోవాలని అనుకోలేదని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.ఈ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ ప్రీతీ జింటాను తీసుకోవాలని ఆమెను సంప్రదించాడట విష్ణు.
కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని, అందుకే వెంటనే కాజల్‌ను ఈ సినిమాలో తీసుకున్నామని విష్ణు చెప్పుకొచ్చాడు.ఇక మంచు విష్ణు ఈ సినిమా ఆఫర్‌ను తనముందు పెట్టగానే కాజల్ కూడా వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆయన చెప్పుకొచ్చాడు.
మొత్తానికి వేరే హీరోయిన్‌ను తీసుకోవాలని చూసిన ఈ సినిమాలో ఇప్పుడు కాజల్ నటించడంతో, ఆమె పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కాజల్ అభిమానుల్లో నెలకొంది.ఇక ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా ఈ సినిమా కథను హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ తెరకెక్కించిన విధానం యూనివర్సల్‌గా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండటం మరో విశేషం.మరి మోసగాళ్లు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.