జాతిరత్నాలు హీరోయిన్ కి లక్కీ ఛాన్స్..!

నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ అయ్యింది.అనుదీప్ కెవి డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశారు.

 Jathiratnalu Heroine Faria Lucky Chance Dhee & Dhee , Dhee & Dhee, Faria Addhul-TeluguStop.com

ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

జాతిరత్నాలు లాంటి సూపర్ హిట్ పడ్డాక ఆమెకు వరుస అవకాశాలు వస్తాయని అనుకున్నారు కాని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లో ఏదో ఒక చిన్న రోల్ తప్ప ఫరియాకు పెద్దగా అవకాశాలు రాలేదు.అయితే ప్రస్తుతం ఫరియా ఓ లక్కీ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.

స్టార్ డైరక్టర్ శ్రీను వైట్ల డైరక్షన్ లో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న ఢీ అండ్ ఢీ సినిమాలో హీరోయిన్ గా ఫరియాకు ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది.ఢీ సినిమాలో జెనిలియా హీరోయిన్ గా నటించింది.

ఇక ఇప్పుడు ఈ సీక్వల్ లో అదేనండి డబుల్ ఢీ లో ఫరియా లక్కీ ఛాన్స్ అందుకుంది.ఒక మంచి అవకాశం కోసం చూస్తున్న ఫరియాకి ఇది నిజంగానే లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.

మరి ఈ సినిమా తర్వాత అయినా అమ్మడు బిజీ హీరోయిన్ అవుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube