దాదాపు ఐదు దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న ప్రత్యేకత ఉన్న నేతల్లో కందుకూరి జానారెడ్డి( Kandukuri Janareddy ) ఒకరు.కాంగ్రెస్లో అంతా ఆయన్ను పెద్దయనగా కీర్తిస్తారు ….
ఉన్నత స్థాయి విలువలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే జానారెడ్డి రాజకీయంగా ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా హుందాగా స్పందించేవారు.వైయస్ హయాంలో హోమ్ మినిస్టర్ గా చేసిన జానారెడ్డి ఎన్నో కీలక పరిణామాలకు సాక్షిభూతంగా నిలిచారు ….
ఆయన హయాంలో పరిటాల రవి( Paritala Ravi ) హత్య., బాంబు పేలుళ్లు, మావోయిస్టులు యాక్టివ్ గా ఉండటం

ఇలాంటి కీలక పరిస్థితుల్లో హోం మంత్రిగా ఆయన సమర్థవంతంగా పనిచేశారని చెప్పాలి.2009లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైయస్ ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి( Komati Reddy Venkata Reddy )కిచ్చారు….ఈ పరిణామం అప్పట్లో అందర్నీ ఆశ్చర్యపరిచింది.2014లో మరొకసారి గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలవడంతో ప్రతిపక్షo లో కూర్చోవాల్సి వచ్చింది … కెసిఆర్ కూడా ఈయనకు ఉన్న అపార అనుభవం రీత్యా ఈయనకు తగిన మర్యాద ఇచ్చేవారు .అసెంబ్లీలో ముఖ్యమైన విషయాల్లో ఈయన సలహాలు తీసుకునేదవారు .ఈయన పట్ల ఎక్కడా విమర్శ చేయకుండా జాగ్రత్త పడేవారు .
2019లో జరిగిన ఎన్నికల్లో ఈయన తన సమీప ప్రత్యర్ధి నోముల నరసింహయ్య చేతుల్లో ఓటమి పాలయ్యారు .అయితే నోముల నర్సింహయ్య మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు నోముల భగత్ చేతిలో కూడా వొడిపోవడం తో క్రియాశీల రాజకీయాలకు దూరం గా ఉంటూ వస్తున్నారు .వయోభారం రీత్యా కూడా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగే పరిస్థితి లేకపోవడంతో ఆయన కుమారుడిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారు ఆయన కుమారుడు రఘువీర్ రెడ్డి కూడా సౌమ్యుడిగా పేరుపొందారు.

బాల్యం నుంచి తండ్రి రాజకీయాల్లోనే ఉండడంతో ఆయనకు నియోజకవర్గం పై మంచి పట్టు ఉందని చాలామంది నేతలతో ప్రత్యక్ష పరిచయం ఉందని సమాచారం.అనుభవజ్ఞుడైన తండ్రి మార్గదర్శకంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు సిద్ధమవుతున్నారని సమాచారం ఇప్పటికే టికెట్ కూడా కన్ఫర్మ్ అయిందని వార్తలువస్తున్న నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే అవ్వటం ఖాయమే అన్న అంచనాలు ఉన్నాయి….