ఆలూ సాగులో సునీత‌ ఆద‌ర్శం... ఏంచేశారంటే..

ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రాంపూర్ జిల్లా రెహ్రా బ్లాక్‌లోని రాంపూర్ అర్నా నివాసి సునీతా జైస్వాల్ ఒక్క ఎక‌రంలో 22 క్వింటాళ్ల బంగాళదుంపలను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించారు.రెహ్రా బ్లాక్‌లోని రాంపూర్ అర్నా నివాసి ఛథీరామ్ వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

 Jaiswal Cultivated 22-quintals Of Potato In One Acre Land , Potato , Forming ,-TeluguStop.com

నలుగురు కూతుళ్లలో సునీత ఒక‌రు.సునీత.

బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది.వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, సునీత స్వయంగా సహ పంటలు, శాస్త్రీయ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకుంది.

ఆమె సలహా కుటుంబ సభ్యులకు నచ్చింది.నవంబర్‌లో పాణి సంస్థ జిల్లా మేనేజర్ రాజీవ్ మిశ్రా నుంచి రెండు క్వింటాళ్ల ఆలు విత్త‌నాలు తీసుకుని విత్తారు.

మంచి దిగుబడి కోసం ఆయన ఇచ్చిన పద్ధతి ప్రకారం వ్యవసాయం ప్రారంభించారు.రెండుసార్లు మట్టిని సారవంతం చేయడం, రసాయన ఎరువులతో దేశీయ ఎరువును కలిపి వినియోగించారు.

మంచి దిగుబడిని చూసి కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు.ఒక్క ఎక‌రంలో 22 క్వింటాళ్ల బంగాళాదుంప సాగు చేసి రికార్డు సృష్టించింది సునీత.

ఆధునిక వ్యవసాయం ద్వారా తక్కువ సమయంలో విజయం సాధించి సునీత రికార్డు సృష్టించిందని జిల్లా వ్యవసాయ అధికారి డా.ఆర్.పి.రాణా తెలిపారు.దేశంలోని ఇతర రైతులు సునీత కృషి, అంకితభావం, అభిరుచిని చూసి చాలా నేర్చుకోవ‌చ్చ‌న్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube