ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ( Telangana Politics) వేడెక్కుతున్నాయి.ఇంకో ఏడు రోజుల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో అభ్యర్థులంతా ప్రచారంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రజల నుంచి ఓట్లను సంపాదించుకోవడం కోసం పడని పాట్లు పడుతున్నారు.అలాంటి తెలంగాణ నియోజకవర్గాలన్నింటిలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కొల్లాపూర్ నియోజక వర్గం గురించే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం బర్రెలక్క అలియాస్ శిరీష.ఒక సామాన్య నిరుద్యోగి నామినేషన్ వేసి సంచలనం సృష్టిస్తోంది.
ఆ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) , బీఆర్ఎస్ పార్టీ నుంచి బీరం హర్షవర్ధన్ నామినేషన్ వేసి ప్రచారంలో మునిగిపోయారు.అంతటి సీనియర్ లీడర్లను టార్గెట్ చేస్తూ బర్రెలక్క నామినేషన్ వేసి ప్రచారంలో మునిగిపోయింది.
అడుగడుగునా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తాను గెలిచే తీరుతానని అంటుంది.ఆమె కొల్లాపూర్ ( Kollapur ) నియోజక వర్గమే కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి, రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రజలు, మేధావులు సపోర్ట్ చేస్తున్నారు.
అలాంటి కొల్లాపూర్ లో బర్రెలక్క విజయం సాధిస్తుందా.ఆమెకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
అనే వివరాలు చూసేద్దాం.కొల్లాపూర్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది.

ఇందులో కొల్లాపూర్, వీపనగండ్ల, పానగల్, పెద్దకొత్తపల్లి, కోడేరు వంటి మండలాలు ఉన్నాయి.అలాంటి కొల్లాపూర్ నియోజకవర్గంలో శిరీష ( Sirisha ) ఎంట్రీ తర్వాత రాజకీయం ఒక ఎత్తు, శిరీష ఎంట్రీ కాకముందు మరో ఎత్తు ఉండేది.అక్కడ బలమైన నాయకులైనటువంటి జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ మాత్రమే పోటాపోటీగా ఉండేవారు.ఈ తరుణంలోనే బర్రెలక్క అలియాస్ శిరీష ఎంట్రీ ఇచ్చి అక్కడి రాజకీయ చిత్రాన్ని అంతా మార్చిందని చెప్పవచ్చు.
నిరుద్యోగుల తరఫున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు అందరినీ ఆలోచించేలా చేస్తోంది.

ఇదే క్రమంలో ఆమెకు విపరీతమైన ఆదరణ పెరిగిపోతుందట.ఇది తట్టుకోలేనటువంటి కొంతమంది నాయకులు ఆమెపై దాడులు కూడా చేయించారు.అయినా బర్రెలక్క మాత్రం ప్రచారం ఆపలేదు.
సోషల్ మీడియా వేదికగా తన గొంతు వినిపిస్తోంది.దీంతో అక్కడ సంపన్న నాయకులకు మరియు ఒక సాధారణ నిరుద్యోగి మధ్య జరిగే పోటీ లాగా కనిపిస్తోంది.
ఈ తరుణంలో చాలామంది ప్రజలు బర్రెలక్కకు స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తున్నట్టు సమాచారం.ఇప్పటికి ఆమెకు 40 వేల కుటుంబాల వరకు పూర్తిస్థాయిగా సపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చారట.
దీన్ని బట్టి చూస్తే బర్రెలక్క (Barrelakka) కు ఇప్పటికే 60 నుంచి 70 వేల ఓట్ల వరకు పడే అవకాశం కనిపిస్తోంది.మరి ఈ వారం రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయో తెలియదు.
బర్రెలక్క ప్రచారం ఈ విధంగానే కొనసాగితే మాత్రం తప్పక బడా బడా నేతలను ఓడించి బర్రెలక్క అలియాస్ శిరీష గెలుస్తుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.