పొత్తు వ్యూహానికి ప్రతి వ్యూహం జగన్ సిద్ధం చేశారా?

గత కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రతిపక్షాలు ప్రభుత్వంపై భారీ ఎత్తున వ్యతిరేకత ఉంది అని ఆ వ్యతిరేకత చీలిపోకుండా తాము పొత్తులతో కలిసి నడవబోతున్నట్లుగా ప్రకటించుకున్నాయి.సంక్షేమ పథకాల( Welfare schemes ) అమలు తప్ప, మౌలిక అభివృద్ధిలో కానీ ఉద్యోగితా శాతాన్ని పెంచడంలో కానీ పారిశ్రామిక అభివృద్ధిలో కానీ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని భావిస్తున్న ప్రతిపక్షాలు ప్రజల్లో అధికార పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఎన్నికల సమయం లో అది ప్రస్ఫుటమవుతుందని నమ్ముతున్నాయి.

 Is Jagan Prepared New Strategy To Beat Alliance , Alliance , Tdp, Jana Sena, Paw-TeluguStop.com

అందువల్ల తాము కలిసి నడిస్తే ఖచ్చితంగా విజయ దుందుభి మోగించవచ్చన్న అంచనాలలో ఆ పార్టీలు ముందుకు వెళుతున్నాయి.ఇప్పుడు రెండు పార్టీల పొత్తు కన్ఫామ్ అయిపోవడంతో తన ప్రతి వ్యూహానికి జగన్ తెరతీసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

ప్రతిపక్షాలు చెబుతున్న వ్యతిరేకత ఆ స్థాయిలో లేదని ఇంతకాలం నమ్మిన జగన్ ఒక వేళ వ్యతిరేకత ఉన్న ముందు జాగ్రత్తగా ఆ వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది.

Telugu Alliance, Ap, Chandrababu, Jana Sena, Pawan Kalyan-Telugu Political News

గ్రామీణ ఓటింగ్ తన బలం అని ఎప్పుడో గుర్తించిన గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు .ఇప్పుడు పల్లెసీమలపై మరింత దృష్టి పెట్టబోతున్నారట, సచివాలయాలు వాటి అనుబంధంగా వాలంటరీ వ్యవస్థతో పరిపాలనను సాగిస్తున్న జగన్ ఇక తన పార్టీ క్యాడర్ ని మొత్తం గ్రామీణ ప్రాంతాలలో అందుబాటులో ఉండేలా పల్లెబాట చెయ్యాలని ఆదేశించినట్లుగా తెలుస్తుంది .మండల వారి పార్టీ అధ్యక్షులు గ్రామాలలోని పార్టీ కమిటీలతో అనుసంధానం చేసి రాత్రిపూట పల్లెనిద్ర చేసి అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయాలని ,ప్రభుత్వ పథకాలు దక్కని వారిని గుర్తించి వెంటనే వారికి పథకాలను అందేలా సమస్యలను తక్షణం పరిష్కరించేలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది.

Telugu Alliance, Ap, Chandrababu, Jana Sena, Pawan Kalyan-Telugu Political News

పట్టణ ప్రాంతాలలో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ పల్లెలలో జగన్( YS Jagan Mohan Reddy ) తాలూకు సంక్షేమ పథకాలు 90% పైగా అందుతున్నట్టుగా గ్రహించిన జగన్ ఈ ఆరు నెలల కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వారిలో అసంతృప్తి కలగకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది .ఆంధ్రా లో ఇప్పటికీ 70% ఓటింగ్ గ్రామీణ ప్రాంతాలలోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా తనకు బలమైన ఓట్ బ్యాంక్ గా మారుతుందని జగన్ నమ్మకం పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.అందువల్ల ప్రతిపక్షాలు కలిసి వచ్చినా విడిగా వచ్చినా తమ ఓటు బ్యాంకుకు డోకా లేదని వైసీపీ అధినేత నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube