స్టార్ హీరోనందమూరి బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కి 2001 సంవత్సరం జనవరి 11వ తేదీన విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా హిట్ గా నిలిచింది నరసింహ నాయుడు సినిమా.బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నా ఈ సినిమా మరింత ప్రత్యేకం.ఈ సినిమాకు చిన్నికృష్ణ రచయిత కాగా పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు.2001 సంవత్సరంలోనే 30 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించిన ఈ సినిమా కథ సిద్ధం తయారు కావడం వెనుక ఎంతో మంది కృషి, ఎన్నో మార్పులుచేర్పులు ఉన్నాయి.
రచయిత చిన్నికృష్ణ చెప్పిన చిన్న కథను బి గోపాల్ పరుచూరి గోపాలకృష్ణకు చెప్పగా ఆ చిన్న కథ ఎంతో బాగుందని గోపాలకృష్ణ బి గోపాల్ కు చెప్పారు.ఆ తరువాత బి గోపాల్ చిన్నికృష్ణకు మిగిలిన కథను పూర్తి చేయమని సూచించారు.
చిన్నికృష్ణ కథ పూర్తి చేసిన తరువాత బి గోపాల్, చిన్నికృష్ణ పరుచూరి బ్రదర్స్ దగ్గరకు వెళ్లగా చిన్నికృష్ణ సీమ సింహం మూవీలోని పోలీస్ ఆఫీసర్స్ కథను వేరేలా చెప్పారు.

అయితే ఆ కథను విన్న పరుచూరి బ్రదర్స్ కథ అంత గొప్పగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ తరువాత చిన్నికృష్ణ బీహార్ లోని ఒక సంఘటనను ఆధారంగా తీసుకుని ఇంటికి ఒక మగ పిల్లాడిని బలి పశువుగా ఇచ్చే నరసింహ నాయుడు కథను తయారు చేశారు.అలా సిద్ధమైన నరసింహ నాయుడు సినిమా కథ హీరో బాలకృష్ణ హీరోయిన్లు సిమ్రాన్, ప్రీతి జింగాని, ఆశా షైనీ, దర్శకుడు బి గోపాల్, రచయిత చిన్నికృష్ణ, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, మాటల రచయితలు పరుచూరి బ్రదర్స్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.
ఆ సినిమాలోని కత్తులతో కాదురా కంటిచూపుతో చంపేస్తా డైలాగ్ ఎంతో పాపులర్ అయింది.ఆ డైలాగ్ ను ఆఖరి సన్నివేశం తీస్తున్న సమయంలో గోపాలకృష్ణ రాయడం గమనార్హం.
కథ, కథనం అద్భుతంగా ఉన్న ఈ చిత్రం నిన్నటితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.