ఒకే కథతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలకృష్ణ, నాగేశ్వరరావు.. ఏ సినిమాలంటే?

స్టార్ హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న అఖండ మూవీ రిజల్ట్ గురించి మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.థియేట్రికల్ ట్రైలర్ 15వ తేదీన రిలీజవుతుందని ట్రైలర్ రిలీజైన మూడు వారాల తర్వాత సినిమా రిలీజవుతుందని సమాచారం.

 Interesting Facts About Akkineni Nageswara Rao Premabhishekam Movie Details, An-TeluguStop.com

డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అఖండ రిలీజయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.సరైన సక్సెస్ లేని బాలయ్య సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీనుపై నమ్మకం పెట్టుకున్నారు.

బోయపాటి బాలయ్య నమ్మకాన్ని, బాలయ్య అభిమానుల నమ్మకాన్ని నిలబెడతారో లేదో తెలియాలంటే మరికొన్నిరోజులు ఆగాల్సిందే.మరోవైపు బాలయ్య ఓటీటీలో అన్ స్టాపబుల్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో పాటు గోపీచంద్ మలినేని కాంబో మూవీని కూడా అతి త్వరలో మొదలుపెట్టనున్నారు.

అయితే బాలకృష్ణ, నాగేశ్వరరావు ఒకే తరహా కథలలో నటించి ఆ సినిమాలతో విజయాలను అందుకున్నారు.

ఏఎన్నార్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ప్రేమాభిషేకం ఒకటనే సంగతి తెలిసిందే.

Telugu Balakrishna, Bobbili Simham, Dasari Yana Rao, Premabhishekam, Story-Movie

దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.ఈ సినిమాలో హీరో క్యాన్సర్ తో బాధ పడుతూ ఉంటారు.అయితే తనకు ఉన్న ఆరోగ్య సమస్యను బయటపెట్టకుండా హీరోయిన్ కు వేరే పెళ్లి జరిగేలా చేస్తారు.బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన నిలిచిన ప్రేమాభిషేకం నిర్మాతకు భారీ లాభాలను మిగిల్చింది.

Telugu Balakrishna, Bobbili Simham, Dasari Yana Rao, Premabhishekam, Story-Movie

కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బొబ్బిలి సింహం సైతం దాదాపుగా ఇదే తరహా కథాంశంతో తెరకెక్కడం గమనార్హం.బొబ్బిలి సింహం మూవీలో హీరోయిన్ కు క్యాన్సర్ కాగా హీరోయిన్ ఆ విషయాన్ని దాచిపెట్టి హీరోకు మరో పెళ్లి జరిగే విధంగా చేస్తుంది.అయితే బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు మంచి సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube