అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి మృతి .. ఈ ఏడాదిలో 9వ ఘటన

అమెరికాలో భారతీయ విద్యార్దుల( Indian Students ) వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.తాజాగా మరో విద్యార్ధి మృతి చెందాడు.

 Indian Student Dies In Us State Of Ohio Details, Indian Student Dies ,us , Ohio-TeluguStop.com

ఈ ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో( America ) మరణించిన భారతీయులు, భారత విద్యార్ధుల సంఖ్య తొమ్మిదికి చేరింది.దురదృష్టవశాత్తూ ఇతను తెలుగువాడు కావడం గమనార్హం.

ఒహియోలోని క్లీవ్‌లాండ్‌లో( Cleveland ) ఉమా సత్య సాయి గద్దె( Uma Satya Sai Gadde ) అనే విద్యార్ధి ఆకస్మికంగా మరణించినట్లు న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది.ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని.

భారత్‌లోని బాధిత కుటుంబంతో తాము టచ్‌లో వున్నట్లు కాన్సులేట్ కార్యాలయం పేర్కింది.ఉమా గద్దె భౌతికకాయాన్ని త్వరగా భారత్‌కు తరలించడంతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.

Telugu Amarnath Ghosh, Cleveland, Indian, Ohio, Sameer Kamath, Umasatya, Usatelu

2024 ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు అమెరికాలో కనీసం అరడజను మంది భారతీయ , భారత సంతతికి చెందిన విద్యార్దులు ప్రాణాలు కోల్పోయారు.దాడుల సంఖ్య ఆందోళనకరంగా పెరగడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.గత నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శిక్షణ పొందిన నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్( Amarnath Ghosh ) మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపబడ్డాడు.పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్( Sameer Kamath ) ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై తేలాడు.

ఫిబ్రవరి 2న వివేక్ తనేజా (41) అనే భారత సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్.వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

Telugu Amarnath Ghosh, Cleveland, Indian, Ohio, Sameer Kamath, Umasatya, Usatelu

మరోవైపు.భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు , విద్యార్ధులపై వరుస దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం , అమెరికాలోని పలు నగరాల్లో వున్న భారత కాన్సులేట్‌లు అప్రమత్తమయ్యాయి.దేశం నలుమూలల నుంచి వచ్చిన భారతీయ విద్యార్ధులతో వర్చువల్ ఇంటరాక్షన్‌ని నిర్వహించేందుకు , విద్యార్ధుల శ్రేయస్సు, వివిధ అంశాలను చర్చించడానికి చొరవ తీసుకున్నాయి.ఛార్జ్ డి ఎఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ నేతృత్వంలో 90 అమెరికా యూనివర్సిటీల నుంచి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్ అసోసియేన్ ఆఫీస్ బేరర్లు, విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube