అమెరికాలో మరో భారత సంతతి విద్యార్ధి మృతి .. ఈ ఏడాదిలో 9వ ఘటన
TeluguStop.com
అమెరికాలో భారతీయ విద్యార్దుల( Indian Students ) వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి.
తాజాగా మరో విద్యార్ధి మృతి చెందాడు.ఈ ఘటనతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకు అమెరికాలో( America ) మరణించిన భారతీయులు, భారత విద్యార్ధుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
దురదృష్టవశాత్తూ ఇతను తెలుగువాడు కావడం గమనార్హం.ఒహియోలోని క్లీవ్‌లాండ్‌లో( Cleveland ) ఉమా సత్య సాయి గద్దె( Uma Satya Sai Gadde ) అనే విద్యార్ధి ఆకస్మికంగా మరణించినట్లు న్యూయార్క్‌లోని ఇండియన్ కాన్సులేట్ తెలిపింది.
ఈ ఘటనపై పోలీసుల విచారణ జరుగుతోందని.భారత్‌లోని బాధిత కుటుంబంతో తాము టచ్‌లో వున్నట్లు కాన్సులేట్ కార్యాలయం పేర్కింది.
ఉమా గద్దె భౌతికకాయాన్ని త్వరగా భారత్‌కు తరలించడంతో పాటు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందజేస్తున్నట్లు కాన్సులేట్ కార్యాలయం తెలిపింది.
"""/" /
2024 ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు అమెరికాలో కనీసం అరడజను మంది భారతీయ , భారత సంతతికి చెందిన విద్యార్దులు ప్రాణాలు కోల్పోయారు.
దాడుల సంఖ్య ఆందోళనకరంగా పెరగడం సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.గత నెలలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శిక్షణ పొందిన నృత్యకారుడు అమర్‌నాథ్ ఘోష్( Amarnath Ghosh ) మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపబడ్డాడు.
పర్డ్యూ యూనివర్సిటీలో 23 ఏళ్ల భారతీయ అమెరికన్ విద్యార్ధి సమీర్ కామత్( Sameer Kamath ) ఫిబ్రవరి 5న ఇండియానాలో శవమై తేలాడు.
ఫిబ్రవరి 2న వివేక్ తనేజా (41) అనే భారత సంతతికి చెందిన ఐటీ ఎగ్జిక్యూటివ్.
వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ వెలుపల జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
"""/" /
మరోవైపు.భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులు , విద్యార్ధులపై వరుస దాడుల నేపథ్యంలో వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం , అమెరికాలోని పలు నగరాల్లో వున్న భారత కాన్సులేట్‌లు అప్రమత్తమయ్యాయి.
దేశం నలుమూలల నుంచి వచ్చిన భారతీయ విద్యార్ధులతో వర్చువల్ ఇంటరాక్షన్‌ని నిర్వహించేందుకు , విద్యార్ధుల శ్రేయస్సు, వివిధ అంశాలను చర్చించడానికి చొరవ తీసుకున్నాయి.
ఛార్జ్ డి ఎఫైర్స్ అంబాసిడర్ శ్రీప్రియా రంగనాథన్ నేతృత్వంలో 90 అమెరికా యూనివర్సిటీల నుంచి దాదాపు 150 మంది ఇండియన్ స్టూడెంట్ అసోసియేన్ ఆఫీస్ బేరర్లు, విద్యార్ధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అట్లాంటా, చికాగో, హ్యూస్టన్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
1000 కోట్లతో చరిత్ర సృష్టించిన పుష్పరాజ్.. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ ఈ సినిమానే!