ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీకి ( Janasena party )షాక్ తగిలింది.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు పార్టీని వీడిన ఆయన వైసీపీ గూటికి చేరారు.
ఈ మేరకు సీఎం జగన్( CM Jagan ) సమక్షంలో రాజబాబు ఇవాళ వైసీపీ కండువా కప్పుకున్నారు.జనసేన టికెట్లను అమ్ముకుని అమలాపురం ( Amalapuram )నియోజకవర్గంలో జనసేన జెండా పీకేశారని రాజబాబు తీవ్ర ఆరోపణలు చేశారు.
జనసేన కంచుకోటగా ఉన్న అమలాపురంను పొత్తు పేరిట టీడీపీకి ధారాదత్తం చేశారని మండిపడ్డారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే జన సైనికులను పవన్ కల్యాణ్ మోసం చేస్తున్నారని విమర్శలు చేశారు.
అయితే జనసేన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజబాబు రెండు రోజుల క్రితం పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.