ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఏనుగులు హల్ చల్ చేశాయి.భామినీ మండలం పరిసర ప్రాంతాల్లో గజరాజుల గుంపు బీభత్సం సృష్టిస్తుంది.
మండలంలోని పలు ప్రాంతాల్లో పంటలను, తోటలను ధ్వంసం చేస్తున్నాయి.అంతేకాకుండా గత వారం రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి చంపేశాయి.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమను, తమ పంటలను కాపాడాలని కోరుతున్నారు.