మారేడు పండును ఇలా ఉపయోగిస్తే ఎలాంటి వ్యాధులైన పరార్..!

ఆయుర్వేదం ప్రకారం మారేడు చెట్టు పండ్లు, బెరడు, ఆకులు, కాయలు, పువ్వులు అన్నీ కూడా ఎన్నో రకాల ఔషధాలు తయారు చేయడానికి ఉపయోగపడతాయి.అలాగే దీని లోపల ఉండే గుజ్జు లాంటి పదార్థాన్ని వెలగా అని పిలుస్తారు.

 If Apricot Is Used Like This, What Kind Of Diseases Can Be Prevented , Wood Appl-TeluguStop.com

ఈ మారేడు పండు కూడా కాయగా ఉన్నప్పుడు రుచిలో కాస్త వగరుగా, పుల్లగా ఉంటుంది.కానీ అదే పండు పూర్తిగా పండుగ మారినప్పుడు తీపి పులుపుతో కూడిన రుచితో ఉంటుంది.

ఈ మారేడు పండు అతీ సరా వ్యాధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.మారేడు పండు( Wood Apple ) రసంలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి.

Telugu Ayurveda, Diabetes, Tips, Heart Problems, Problems, Wood Apple-Telugu Hea

అలాగే మారేడు పండులో మధుమేహం( Diabetes ) అదుపు చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి.మారేడు పండుకున్నా లేత కాయ ఎక్కువ గుణాలను కలిగి ఉంటుంది.మారేడు పండు రసంతో అజీర్ణ సమస్యలు, మలబద్ధకం, గ్యాస్, పేగు పూత వంటి సమస్యలు అన్ని దూరం అవుతాయి.కడుపు నొప్పి,నీరసం లాంటి ఇవన్నీ లక్షణాలు ఉన్న అమీబియాస్ ను మారేడు మూలాలతో సహా మాయం చేయగలదు.

అలాగే ఇది హైపర్ టెన్షన్ కూడా దూరం చేస్తుంది.దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ క్రమంగా కరిగిపోతుంది.గుండే జబ్బుల సమస్యలతో( Heart Problems ) బాధపడే వారికి ఇది ఎంతగానో మేలు చేస్తుంది.

Telugu Ayurveda, Diabetes, Tips, Heart Problems, Problems, Wood Apple-Telugu Hea

ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో మారేడు పండు రసాన్ని తాగితే చలువ చేస్తుంది.మారేడు పండులోనీ గుజ్జును మిక్సీలో వేసి జ్యూస్ చేసుకుని ఇందులో కాస్త నిమ్మరసం, నాలుగైదు పుదీనా ఆకులు, కావాల్సినంత పంచదార వేసుకొని తాగితే వేసవిలోని ఎండల నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.అలాగే శరీరానికి ఇది వెంటనే చలవ చేస్తుంది.

దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు అద్భుతంగా పని చేస్తుంది.శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను ఇది నియంత్రిస్తుంది.

ఆకుల కాషాయం తీసి అవసరం మేరకు కాస్త తేనె కలిపి తాగితే జ్వరం త్వరగా తగ్గిపోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube