ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో రకాల టూత్ పేస్టులు( Toothpastes ) అందుబాటులోకి వచ్చాయి.దంతాలను ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకునేందుకు ఎవరికి నచ్చిన టూత్ పేస్ట్ ను వారు కొనుగోలు చేసి వాడుతుంటారు.
మార్కెట్లో లభ్యం అయ్యే టూత్ పేస్ట్ ల వల్ల ఎంత ప్రయోజనం ఉంది అన్నది పక్కన పెడితే.ఇప్పుడు చెప్పబోయే విధంగా రోజు బ్రష్ చేసుకుంటే మాత్రం మీ దంతాల ఆరోగ్యానికి ఢోకా ఉండదు.

అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు వేపాకు పొడి, నాలుగు టేబుల్ స్పూన్లు మిరియాల పొడి( Pepper Powder ), మూడు టేబుల్ స్పూన్లు పసుపు వేసుకొని అన్నీ కలిసేలా స్పూన్ తో బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పౌడర్ ను ఒక బాక్స్ లో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతిరోజు ఉదయం ఒక బౌల్ లో తయారు చేసుకున్న పౌడర్ ను వన్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో దంతాలకు అప్లై చేసి సున్నితంగా రెండు నుంచి మూడు నిమిషాల పాటు తోముకోవాలి.
ఆపై వాటర్ తో దంతాలను మరియు నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.మార్కెట్లో లభ్యమయ్యే టూత్ పేస్ట్ లకు బదులుగా పైన చెప్పుకున్న హోమ్ మేడ్ టూత్ పౌడర్( Homemade Tooth Powder ) ను వాడితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
పసుపు, వేప పొడి, లవంగాలు, నువ్వుల నూనె దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.బలహీనమైన దంతాలను బలంగా మారుస్తాయి.