త్రివిక్రమ్.. 11 సినిమాలో టాలీవుడ్ టాప్ 2 దర్శకుడు ఎలా అయ్యాడో తెలుసా?

త్రివిక్రమ్ శ్రీనివాస్.తెలుగు సినిమా పరిశ్రమలోని టాప్ దర్శకుల్లో ఆయన ఒకడు.

 How Trivikram Became Star Of Tollywood Details, Director Trivikram, Director Tri-TeluguStop.com

ఇప్పటి వరకు ఆయన 11 సినిమాలను తెరకెక్కించాడు.అందులో ఆరు సినిమాలు మెగాస్టార్ కుటుంబ సభ్యులతోనే చేశాడు.

ఇంకో మూడు ప్రాజెక్టులు వారితోనే చేయబోతున్నాడు.మొత్తంగా మెగా ఫ్యామిలీతో ఆయనకు ఓ విడదీయలేని బాండింగ్ ఏర్పడింది.

తొలుత డైలాగ్ రైటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఆయన.పలు సూపర్ డూపర్ హిట్ సినిమాలకు డైలాగులు రాశాడు.అనంతరం దర్శకుడిగా మెగాఫోన్ అందుకున్నాడు.

దర్శకుడిగా ఆయన తీసిన తొలి సినిమా నువ్వే నువ్వే.

ఈ సినిమాకు ఆయన బెస్ట్ డైలాగ్ రైటర్ గా నంది అవార్డును సైతం అందుకున్నాడు.నాటి నుంచి నేటి అల.వైకుంఠపురంలో వరకు మొత్తం 11 సినిమాలను ఆయన తెరకెక్కించాడు.నువ్వే నువ్వే సినిమాను చూసి సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశం ఇచ్చాడు.

అతడు మూవీతో తన సత్తా చాటుకున్నాడు త్రివిక్రమ్.తన తొలి డైరెక్టోరియల్ ఫిల్మ్ ‘నువ్వే నువ్వే’తో బెస్ట్ డైలాగ్ రైటర్‌గా నంది అవార్డ్ అందుకోవడం విశేషం.

ఆ తర్వాత మహేష్ తో ఖలేజా సినిమా తీశాడు కానీ.అతడు రేంజిలో ఆకట్టుకోలేకపోయాడు.

అయితే మహేష్ ను కామిక్ యాంగిల్లో మాత్రం చూపించగలిగాడు.

Telugu Aa, Dialogue Writer, Trivikram, Mahesh Babu, Nandi Award, Nuvvu Nenu, Tol

అటు యద్దనపూడి సులోచనారాణి నవల మీనా ఆధారంగా తను తీసిన త్రివిక్రమ్ తీసిని అ ఆ సినిమా మరోసారి హిట్ కొట్టింది.ఆ తర్వాత 2018లో జూనియర్ ఎన్టీఆర్‌తో అరవింద సమేత.సినిమా తీసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు.

అటు మెగా హీరోల్లో తను తొలిసారి పవన్ కల్యాణ్‌తో జల్సా సినిమా తీసి మంచి హిట్ కొట్టాడు.అనంతరం పవన్‌తో అత్తారింటికి దారేది తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

Telugu Aa, Dialogue Writer, Trivikram, Mahesh Babu, Nandi Award, Nuvvu Nenu, Tol

అనంతరం అల్లు అర్జున్ తో కలిసి జులాయి తీసి వారెవ్వా అనిపించాడు.ఆయనతోనే మరో సన్నాఫ్ సత్యమూర్తి తీసి బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు.అనంతరం 2020లో బన్నీతో అల.వైకుంఠపురములో సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.అటు మహేష్ తో మరో మూవీ చేయబోతున్నాడు.మొత్తంగా 11 సినిమాలతో టాలీవుడ్ టాప్ 2 దర్శకుడిగా వెలుగొందుతున్నాడు త్రివిక్రమ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube