ఏ సినిమా సక్సెస్ సాధించాలన్నా హీరో, హీరోయిన్ పాత్రలు అద్భుతంగా నటించాల్సి ఉంటుంది.హీరో, హీరోయిన్ జోడీ అద్భుతంగా లేకపోతే సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
హీరో హీరోయిన్ జోడీ అస్సలు సెట్ కాని సినిమాలలో స్టాలిన్ మూవీ( Stalin Movie ) ముందువరసలో ఉంటుంది.ఈ సినిమాలలో త్రిషకు బదులుగా మరో హీరోయిన్ నటించి ఉంటే ఈ సినిమా రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేది.
ఒక్క మగాడు( Okka Magadu ) సినిమాలో బాలయ్య అనుష్క జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు.ఈ సినిమా ఫ్లాప్ కావడానికి ఈ జోడీ కారణమని చాలామంది భావిస్తారు.
అజ్ఞాతవాసి( Agnathavasi ) సినిమాలో పవన్ అను ఇమ్మాన్యుయేల్ జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే జోడీ కూడా బాలేదని నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.
వయస్సులో అఖిల్ కంటే పూజా హెగ్డే నాలుగేళ్లు పెద్ద అనే సంగతి తెలిసిందే.
![Telugu Agnathavasi, Ananya Pandey, Anushka, Balayya, Chiranjeevi, Dammu, Liger, Telugu Agnathavasi, Ananya Pandey, Anushka, Balayya, Chiranjeevi, Dammu, Liger,](https://telugustop.com/wp-content/uploads/2024/03/hero-heroine-combination-not-suitble-stalin-agnathavasi-simha-dammu-liger-varudu-detailsa.jpg)
దమ్ము సినిమాలో( Dammu Movie ) జూనియర్ ఎన్టీఆర్ త్రిష జోడీ కూడా అస్సలు సూట్ కాలేదు.దడ సినిమాలో చైతన్య కాజల్ జోడీ బాలేదు.సింహా మూవీలో( Simha Movie ) బాలయ్య స్నేహా ఉల్లాల్, శంకర్ దాదా జిందాబాస్ సినిమాలో చిరంజీవి కరిష్మా కోటక్ జోడీ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదు.
వరుడు సినిమాలో అల్లు అర్జున్ భాను శ్రీ మెహ్రా జోడీ కూడా సెట్ కాలేదని కామెంట్లు వ్యక్తమయ్యాయి.సుభాష్ చంద్రబోస్ సినిమాలో వెంకటేశ్ శ్రియ జెనీలియా కూడా అస్సలు సూట్ కాలేదు.
![Telugu Agnathavasi, Ananya Pandey, Anushka, Balayya, Chiranjeevi, Dammu, Liger, Telugu Agnathavasi, Ananya Pandey, Anushka, Balayya, Chiranjeevi, Dammu, Liger,](https://telugustop.com/wp-content/uploads/2024/03/hero-heroine-combination-not-suitble-stalin-agnathavasi-simha-dammu-liger-varudu-detailss.jpg)
లైగర్ సినిమాలో( Liger ) విజయ్ దేవరకొండ అనన్య పాండే జోడీ గురించి కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.కొమరం పులి సినిమాలో నిఖిషా పటేల్ హీరోయిన్ గా నటించగా ఈ జోడీ కూడా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.హీరో హీరోయిన్ జోడీ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.