రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్( game changer ) సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
అయితే ఈ సినిమా సెకండ్ సింగిల్ కు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చినా సెకండ్ సింగిల్ ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.దిల్ రాజు సైతం ఈ సినిమా డేట్ గురించి క్లారిటీగా చెప్పలేకపోతున్నారు.

అయితే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చికి వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. దిల్ రాజు( Dil Raju ) చెప్పినా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అభిమానులు అస్సలు నమ్మట్లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది.గేమ్ ఛేంజర్ సినిమాలో ట్విస్టులు అదిరిపోయేలా ఉండనున్నాయని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమాలో యాక్షన్ సీన్లు సైతం అదిరిపోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్స్ ఎప్పటినుంచి పూర్తిస్థాయిలో మొదలవుతాయో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ విషయంలో మాత్రం అభిమానులు ఏ మాత్రం సంతోషంగా లేరు.
గేమ్ ఛేంజర్ చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా కోసం రామ్ చరణ్( Ram Charan ) ఏకంగా మూడేళ్ల సమయం కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా కలెక్షన్ల పరంగా అదరగొట్టాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.గేమ్ ఛేంజర్ సినిమా సక్సెస్ సాధించడం శంకర్ కు కూడా ముఖ్యమనే సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.గేమ్ ఛేంజర్ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.