ఫ్లాప్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలు ఇవే?

ప్రస్తుత కాలంలో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కావడం సులభమైన విషయం కాదు.అయితే కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేశాయి.

 From Pellisandadi Racha To Sarrainodu Maharshi These 12 Movies Opens With Negati-TeluguStop.com

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా ఫ్లాప్ టాక్ తో కూడా 70 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించడంతో పాటు హిట్ స్టేటస్ ను అందుకుంది.

శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లిసందడి సినిమాకు మొదటిరోజే డిజాస్టర్ టాక్ వచ్చింది.అయితే ఊహించని విధంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది.

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా తర్వాత రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

మహర్షి సినిమాకు తొలిరోజే నెగిటివ్ టాక్ రాగా ఈ సినిమా ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించింది.

Telugu Block Buster, Flop, Ismart Shankar, Maharshi, Pellisandadi, Raccha, Sarra

ఈ సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్ రోల్ లో కనిపించడం గమనార్హం.అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో సన్నాఫ్ సత్యమూర్తి సినిమా కూడా ఒకటి.తొలిరోజే నెగిటివ్ టాక్ ను ఈ సినిమా మూటగట్టుకోగా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకుంది.

Telugu Block Buster, Flop, Ismart Shankar, Maharshi, Pellisandadi, Raccha, Sarra

రవితేజ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కిన పవర్, నాని వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎంసీఏ, నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన, గోపీచంద్ శివ కాంబినేషన్ లో తెరకెక్కిన శౌర్యం, రామ్ చరణ్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కిన రచ్చ, వెంకటేష్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన తులసి సినిమా, ఎన్టీఆర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలు ఫ్లాప్ టాక్ తో మొదలై చివరకు హిట్ స్టేటస్ ను అందుకున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube