బెంగళూరు డ్రగ్స్ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల హస్తం ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.ప్రస్తుతం కర్ణాటకలో వెలుగు చూసిన ఈ డ్రగ్స్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
కాగా కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకుని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.కాగా డ్రగ్స్ కేసుకు హైదరాబాద్‌తో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా ప్రస్తుతం అయితే సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఇక్కడి పోలీసులు ఉన్నారట పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికి నోటీసులు ఇస్తామని కర్ణాటక రాష్ట్రం గోవిందపుర పోలీసులు తెలిపారు.అయితే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరన్న విషయాన్ని ఇప్పటి వరకు అధికారులు వెల్లడించకపోవడంతో ఈ విషయం పై తెలంగాణలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.