మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోండి..!

రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య బీకర యుద్ధం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే.రష్యా -ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరిగితే భారత్ కు ఒక పెద్ద చిక్కు వచ్చి పడిందనే చెప్పాలి.

 Flower Oil Shipment Stopped In Black Sea Latest News, Viral Latest, Viral New-TeluguStop.com

అది ఏంటంటే మన భారతదేశానికి రవాణాలో రావలిసిన 3 లక్షల 80 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్మెంట్ నల్ల సముద్రం దగ్గరలోని పోర్టుల్లో నిలిచిపోయింది.అంతేకాకుండా యుద్ధం కారణంగా పోర్టులు తమ కార్యకలాపాలను కూడా నిలిపివేయడంతో కొత్తగా వంటనూనె ఆర్డర్లు కూడా ఆగిపోయాయి.

దీనితో భారతదేశ ప్రజలు వంట నూనె ఇబ్బందులను ఎదుర్కోవాలిసిన పరిస్థితులు వస్తున్నాయానే చెప్పాలి.నిజానికి పోర్టులో నిలిచిపోయిన వంట నూనె మళ్ళీ ఎప్పుడు రవాణా చేయబడుతుందో అనే సమాచారం ఇంకా తెలియదు.

రవాణా కాకుండా పోర్టులో నిలిచిపోయిన వంట నూనెల విలువ చూస్తే భారీగానే ఉంటుంది.మార్కెట్ ధర ప్రకారం వంట నూనెల విలువ 570 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాలకు చెందిన డీలర్లు అంటున్నారు.

ఇలా సన్ ఫవర్ ఆయిల్ రవాణా నిలిచిపోతే రానున్న రోజుల్లో దేశీయ ప్రజలు వంటలలో పామాయిల్, సోయా ఆయిల్ వినియోగించవలసిన పరిస్థితి వస్తుందని వ్యాపార వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

ప్రపంచంలోని సన్ ఫ్లవర్ ఉత్పత్తిలో నల్ల సముద్రం ప్రఖ్యాతి గాంచింది.మన భారతదేశం విషయానికి వస్తే.ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో మన దేశం కూడా ఒకటి.భారత్ కు నల్ల సముద్ర ప్రాంతం నుంచి సుమారు 5.10 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ఆర్డర్లు ఉండగా ఇప్పటికి కేవలం 1.30 లక్షల టన్నులు మాత్రమే రవాణా అయ్యాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.మరి మిగిలిన సన్ ఫ్లవర్ ఆయిల్ ఎప్పుడు భారత్ కు చేరుకుంటుందో అనే విషయం పట్ల క్లారిటీ అయితే లేదు.

అంటే రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు మరికాస్త పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.

Flower Oil Shipment Stopped In Black Sea Latest News

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube