Sitara : మహేష్ బాబు కూతురు సితార పేరుతో అలాంటి మోసాలు.. వాటిని నమ్మితే మోసపోవాల్సిందే!

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని( Sitara Ghattamaneni ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అతి చిన్న వయసులోనే భారీగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న సెలబ్రిటీల పిల్లల్లో సితార ముందు వరుసలో ఉంటుందని చెప్పవచ్చు.

 Fake Instagram Accounts In The Name Of Mahesh Babu Daughter Sitara-TeluguStop.com

ఈ చిట్టి పాపకు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు.ఈమె చిన్న వయసులోనే తన మంచి మనసుతో ఎంతోమందికి సహాయం చేస్తూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంది.

మొన్నటికి మొన్న ఒక జ్యువెలరీ యాడ్స్ లో నటించి మరింత పాపులారిటీని సంపాదించుకుంది.

Telugu Cyber Crimes, Gmb, Mahesh Babu, Sitara, Tollywood-Movie

అంతేకాకుండా ఈ యాడ్ కాను సితార దాదాపుగా కోటి రూపాయల వరకు పారితోషికాన్ని అందుకుంది.ఇకపోతే ఇటీవల కాలంలో సితారకు సంబంధించిన ఏదో ఒక విషయం తరచూ వార్తల్లో వినిపిస్తూనే ఉంది.ఈ నేపథ్యంలోనే తాజాగా సోషల్ మీడియాలో( Social Media ) సితార పేరు హాట్ టాపిక్ గా మారింది.

కొందరు సైబర్ నేరగాళ్లు సితార ను టార్గెట్ చేశారు.అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సెలబ్రెటీల పేరుతో ఫేక్ అకౌంట్( Fake Account ) క్రియేట్ చేసి డబ్బులు భారీ మొత్తంలో గుంజుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఇలా చాలామంది సెలబ్రిటీల పేర్లు వాడుకొని డబ్బులు గుంజగా తాజాగా సితార పేరు వాడుకొని కొంతమంది సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ లు క్రియేట్ చేశారు.

Telugu Cyber Crimes, Gmb, Mahesh Babu, Sitara, Tollywood-Movie

సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌( Instagram ) నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులు పలువురికి పంపుతున్నట్లు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ గుర్తించింది.ఇటువంటి వాటిని నమ్మొద్దని ఆ సంస్థ పేర్కొంది.దీనికి సంబంధించి మాదాపుర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సెలబ్రిటీల పేరుతో ఇలాంటి లింకులు వస్తే అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ సూచించింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో సితార పేరుతో వస్తున్న నకిలీ అకౌంట్లను నమ్మవద్దని జిఎంబి టీమ్ అభిమానులను హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube