టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగింపుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.చిత్తూరు జిల్లాలో ఆయన చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కొనసాగుతోంది.
అయితే ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో పాదయాత్రకు ఎన్నికల కోడ్ గండం వాటిల్లింది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి చిత్తూరు కలెక్టర్ లేఖ రాశారు.
పాదయాత్రపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలపాలని లేఖలో కోరారు.పాదయాత్ర ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిధిలోకి పరిధిలోకి వస్తుందో రాదో చెప్పాలని విన్నవించారు.
మార్చి 13న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చిత్తూరు జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.