కొలంబియా వర్సిటీలో ఇజ్రాయెల్ వ్యతిరేక అల్లర్లు .. భారీగా అరెస్ట్‌లు, న్యూయార్క్ పోలీసులపై ట్రంప్ ప్రశంసలు

ఇజ్రాయెల్ – పాలస్తీనా(Israel, Palestine) యుద్ధ ప్రభావం పలు దేశాలపై నేరుగా పడుతోంది.ఇజ్రాయెల్‌కు మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

 Donald Trump Hails Nypd For Dramatic Columbia University Arrests, Israel , Pales-TeluguStop.com

ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.అగ్రరాజ్యం అమెరికాలోని యేల్, కొలంబియా, న్యూయార్క్(Columbia, New York) యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనల్లో అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు , యువత పాల్గొంటున్నారు.దీంతో పెద్ద సంఖ్యలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

ఈ పరిణామాలపై రిపబ్లికన్ పార్టీ (Republican Party)అధ్యక్ష అభ్యర్ధి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు.

న్యూయార్క్‌లోని సిటీ కాలేజ్, కొలంబియా యూనివర్సిటీలో వందలాది మంది ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనకారులను అరెస్ట్ చేసినందుకు గాను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను ట్రంప్(Trump) అభినందించారు.

న్యూయార్క్ గత రాత్రి ముట్టడిలో వుందని విస్కాన్సిన్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో ఆయన తెలిపారు.నిరసనకారులను వెర్రివాళ్లు, హమాస్ సానుభూతిపరులుగా ట్రంప్ అభివర్ణించారు.

Telugu Columbia, Donald Trump, Israel, York, Palestine, Republican-Telugu NRI

పోలీసులు రంగంలోకి దిగి రెండు గంటల్లోగా మొత్తం క్లియర్ చేశారని ఆయన తెలిపారు.నిరసనకారులు కొలంబియాలో ఒక విద్యాసంబంధ భవనాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో పాటు కొన్ని చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.అస్తవ్యస్తమైన పరిస్దితులను వివరిస్తూ.వారు నిచ్చెనలెక్కి పైకి వెళ్లడం, కిటికీలను పగులగొట్టడం వంటి ప్రమాదకర చర్యలకు పూనుకున్నారని ట్రంప్ చెప్పారు.

Telugu Columbia, Donald Trump, Israel, York, Palestine, Republican-Telugu NRI

కాగా .ఇజ్రాయెల్ (Israel) వ్యతిరేక అల్లర్లను న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సీరియస్‌గా పరిగణించింది.రెండు క్యాంపస్‌లపై దాడి చేసి 300 మంది నిరసనకారులను అరెస్ట్ చేసింది.కొలంబియా వర్సిటీ నుంచి నోటీసు అందుకున్న తర్వాతే పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించినట్లుగా మీడియా నివేదించింది.

విద్యార్ధులను క్యాంపస్ వెలుపలికి పంపించి.బస్సుల్లో ఎక్కించారు.

అయితే యూనివర్సిటీల్లో ఈ తరహా ఘటనలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube