న్యూస్ ఛానల్ లో యాంకర్ సావిత్రిగా పరిచయమైన శివ జ్యోతి( Shiva Jyoti ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.యాంకర్ గా ఉన్న సమయంలో అందర్నీ తన వైపుకు మలుపుకుంది.
ముఖ్యంగా తన తెలంగాణ భాషతో, కట్టుబొట్టుతో అందరినీ ఫిదా చేసింది.తొలిసారిగా వి6 న్యూస్ ఛానల్ తో తీన్మార్ వార్తలతో న్యూస్ యాంకర్ గా పరిచయమై అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకోవటంతో బిగ్ బాస్ షో లో అవకాశం అందుకొని మరింత గుర్తింపు తెచ్చుకుంది.
హౌస్ లో ఉన్నంత కాలం తన పరిచయాన్ని మరింత ఎక్కువగా పెంచుకుంది.తన ఆటపాటలతో బాగా సందడి చేసింది.అందరితో ఫ్రీగా మూవ్ అయ్యింది.ప్రతి ఒక్కరితో తన విషయాలు పంచుకోటమే కాకుండా వాళ్ళ వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకుంది.
ఇక బిగ్ బాస్ లో ఉన్నంతకాలం తనపై మంచి గౌరవం పెంచుకున్నారు అభిమానులు.అయితే ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిందో ఆ తర్వాత నుండి మెల్లి మెల్లిగా తనలో చాలా మార్పులు వచ్చాయి.
ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ ని తయారు చేసుకుని వారితో బాగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.ఇక ఈమెకు గంగూలీ( Ganguly ) అనే వ్యక్తితో పెళ్లి జరగగా ఇప్పటికి వాళ్లకు పిల్లలు లేరు.భర్త సపోర్టు ఎక్కువగా ఉండటంతో శివ జ్యోతి బాగా రెచ్చిపోతూ ఉంటుంది.ఇక ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.తన భర్తను కూడా సెలబ్రెటీగా చేసేసింది.ఇక రీసెంట్ గానే తన గ్యాంగ్ తో కలిసి తిరుమల ట్రిప్( Tirumala Trip ) కు కూడా వెళ్ళింది.
సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా మారింది.ఫోటో షూట్ లు చేయించుకోవటం, తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను పంచుకోవడం చేస్తుంది.యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకొని తను ఏ పని చేసినా కూడా వీడియో ద్వారా బయట పెట్టేస్తూ ఉంటుంది.ఇక తన వేషధారణ పూర్తిగా మారడంతో తను వేసుకునే బట్టలను చూసి జనాలు తనను బాగా విమర్శిస్తున్నారు.
ఒకప్పటి శివ జ్యోతి కి ఇప్పటి శివజ్యోతికి చాలా మార్పు ఉంది అని అంటున్నారు.
ఇదంతా పక్కన పెడితే శివజ్యోతికి పిల్లలు లేకపోయేసరికి తన ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు.ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలలో పిల్లలను ప్లాన్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు.అయితే ఇదంతా పక్కనే పెడితే తాజాగా తను ఇన్స్టాల్ లో కొన్ని ఫొటోస్ పంచుకుంది.
తన ఫ్యూచర్ కిడ్స్ అంటూ తమలాగా ఉన్న చిన్నపిల్లల ఫోటోలు పంచుకుంది.ఇక ఆ ఫొటోస్ వైరల్ అవ్వటంతో.అందులో పాప అచ్చం శివ జ్యోతి లాగే ఉంది. ఇక ఆ ఫోటోలు చూసి కొందరు మీకు నిజంగా పిల్లలు పుడితే బాగుండు అని దీవిస్తున్నారు.
ఇక మరి కొంతమంది మీకు పిల్లలు ఉన్నారా అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.