దర్శకధీరుడు రాజమౌళి టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్నారు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సన్నివేశాలు తెరకెక్కుతుండగా షూటింగ్ లో పాల్గొనడానికి రెండు రోజుల క్రితం అలియా భట్ ఆమె స్టాఫ్ తో కలిసి హైదరాబాద్ కు వచ్చారు.
అయితే అలియా భట్ స్టాఫ్ కు రోజూ లక్షల రూపాయలు ఖర్చవుతోందని.
దీంతో నిర్మాతపై భారం పెరుగుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.అలియా భట్ ఆమెతో పాటు నలుగురు బౌన్సర్లు, పీఏ, మేకప్ ఆర్టిస్ట్, మేనేజర్, పర్సనల్ డ్రైవ్ర్, క్యాస్టూమ్ డిజైనర్ ఉన్నారు.
వీళ్లంతా ఒక స్టార్ హోటల్ లో ఉంటున్నారని.హోటల్ బిల్లే రోజుకు లక్ష రూపాయలు అవుతుందని.
ఇతర ఖర్చులు అన్నీ కలిపిస్తే ఈ భారం ఇంకో లక్షకు పైగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాత సైతం అలియా భట్ విషయంలో గుర్రుగా ఉన్నాయని సమాచారం.ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొనడంతో రాజమౌళి అలియా భట్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.కానీ పెద్ద మొత్తంలో ఖర్చవుతూ ఉండటం రాజమౌళిని సైతం టెన్షన్ పెడుతోందని సమాచారం.
కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఆర్ఆర్ఆర్ సినిమాకు గతంతో పోలిస్తే బడ్జెట్ ను పెంచారు.
మరోవైపు ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడటానికి ఆసక్తి చూపించాలంటే చాలా సమయం పట్టే అవకాశం ఉంది.
ఇలాంటి సమయంలో హీరోయిన్లు స్టాఫ్ కోసం భారీ మొత్తంలో ఖర్చు పెట్టించడంపై ప్రేక్షకుల నుంచి సైతం విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఒక్క హీరోయిన్ కోసం పది మంది స్టాఫ్ అవసరమా.? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.