సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా :సామాజిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స కోసం వచ్చే పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanthi ) ఆదేశించారు.మంగళవారం గంభీరావుపేట మండల( Gambhiraopet ) కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు.

 District Collector Who Inspected Social Health Centre, Social Health Centre , Ra-TeluguStop.com

ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు అందిస్తున్న తీరును కలెక్టర్ ఆరా తీశారు.పేషెంట్లతో మాట్లాడి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తున్నారు…? అన్ని వసతులు సక్రమంగా ఉన్నాయా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రసవాల సంఖ్య పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.మందులు అన్నీ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, లేబర్ రూమ్ లో సదుపాయాలు కల్పించాలని అన్నారు.

ఆరోగ్య కేంద్రానికి వచ్చిన పేషెంట్లకు మెరుగైన, నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించాలని కలెక్టర్ సూచించారు.

సామాజిక ఆరోగ్య కేంద్రం( Social Health Centre ) కోసం నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.

వేగవంతంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా.

సుమన్ మోహన్ రావు( Dr Suman Mohan Rao ), జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా.మురళీధర్ రావు, ఆరోగ్య కేంద్రం వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube