చంద్రబాబుపై సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి.. చెప్పుతో కొడతామంటూ..!!?

ఏపీలో టీడీపీకి చెందిన కొందరు నేతల్లో అసంతృప్త జ్వాల చెలరేగిందని తెలుస్తోంది.సొంత పార్టీ శ్రేణుల నుంచే నేతలకు నిరసన సెగ తగులుతోంది.

 Dissatisfaction Of Own Party Leaders With Chandrababu.-TeluguStop.com

తాజాగా అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు సైతం చేదు అనుభవం ఎదురైందని తెలుస్తోంది.సొంత పార్టీ నేతలే ఆయనపై అంసతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం.

మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అరకు పర్యటనకు వెళ్లగా అక్కడ ఆయనకు నిరసన సెగ బతగిలింది.ఈ క్రమంలోనే నక్కా ఆనంద్ బాబు నిర్వహిస్తున్న సమావేశాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు.

సొంత పార్టీకి చెందిన నేత అబ్రహాంకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.పార్టీలో నాయకులను సైతం పట్టించుకోకపోగా అన్యాయానికి పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారని తెలుస్తోంది.

కాగా టీడీపీ నేత అబ్రహం ఇటీవల మావోయిస్టుల చేతిలో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే సోము కుమారుడు.అయితే అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి పార్టీ అధినేత చంద్రబాబు మోసం చేశారని స్థానిక నేతలు, కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

అంతేకాదు నమ్మించి మాయమాటలు చెప్పి మోసానికి పాల్పడిన చంద్రబాబును చెప్పుతో కొడతామంటూ కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమించినా పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు.

ఇదంతా మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ఎదుటే జరిగిందని తెలుస్తోంది.

ఒక్క అరకు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో టీడీపీ అధిష్టానం తీరుపై సొంత పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సమాచారం.

ఈ క్రమంలోనే నిరసన జ్వాలలు చెలరేగుతుండటంతో పార్టీపై వ్యతిరేక ప్రభావాన్ని చూపిస్తుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube