ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్( Bigg Boss 7) ముగిసింది.ఆటలు,సందడి డాన్స్, ఏడుపులతో ముగిసింది.
అయితే ప్రేక్షకులు ముందుగా అంచనా వేసిన ప్రకారమే ఈసారి సీజన్ విన్నర్ గా ఒక కామన్ మ్యాన్ రైతుబిడ్డ అయినా పల్లవి ప్రశాంతి విజేతగా నిలిచాడు.దాంతో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నేడు సెలబ్రిటీగా మారి హౌస్ లో విన్నర్ గా నిలిచి బయటకు రావడం అన్నది మామూలు విషయం కాదు అంటూ అతన్ని అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అయితే ఈ సీజన్ విన్నర్ అని ప్రచారం జరుగుతున్న పల్లవి ప్రశాంత్ గురించి కాకినాడ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు.ఈమెకు పల్లవి ప్రశాంత్ గురించి ఆయన తండ్రి మాట్లాడుతూ.ఒక పక్క మా పనులు ఆగిపోతున్నా కూడా మా అబ్బాయిపై వారు చూపిస్తున్న ప్రేమ మాకు ఆనందం కలిగిస్తోంది.
ఇంతకముందు మేము ఎవరు అన్న విషయం కూడా చాలామందికి తెలియదు.కానీ ఇప్పుడు మేము కొన్ని లక్షల మందికి తెలుసు.
దీనికి కారణం మా కొడుకు పల్లవి ప్రశాంత్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్( Pallavi prashanth parents ) తమకు ఇది ఏమీ తెలియదని, ఇప్పుడు తమని చూసేందుకు అందరూ వస్తున్నారని, పొలం పనులు చేసుకోనివ్వడం లేదని వెల్లడించారు.అంతేకాదు ఇంత పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు.ఇక ఇక తాను ఒక సీక్రెట్ చెప్పబోతున్నా అని అంటూ 3 నెలల కిందనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు.