ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీ రాధే శ్యామ్.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది.
ఈ సినిమా కోసం రెండున్నర ఏండ్లుగా సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు పెరిగాయి.
వాస్తవానికి ఈ సినిమా సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోంది.ఓ వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
అలా అని బయోపిక్ మాత్రం కాదంటున్నాడు దర్శకుడు రాధా క్రిష్ణ కుమార్.క్రిష్ణం రాజు సమర్పణలో.యువి క్రియేషన్స్ బ్యానర్ లో .వంశీ ప్రమోద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
తాజాగా విడుదల అయిన రాధే శ్యామ్ టీజర్, పాటలు, ట్రైలర్స్ జనాలను బాగా ఆకట్టు కుంటున్నాయి.ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి.తాజాగా ఈ సినిమా గురించి రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.పునర్జన్మ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది అని కొంత మంది అంటుంటేజ అలాంటిది ఏమీ లేదు అని మరికొందరు అంటున్నారు.
అసలు సినిమా కథ ఏంటో తెలియాలంటే మాత్రం సినిమా విడుదల అయ్యే వరకు వెయిట్ చెయ్యక తప్పదు.వాస్తవానికి ఈ సినిమా జనవరిలోనే విడుదల కావాలి.
కానీ కొన్ని కారణాల నేపథ్యంలో మార్చిలో విడుదల కాబోతుంది.ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అవుతుంది.
అయితే సౌత్, నార్త్ ఇండియాలో ఈ సినిమా ఒకేలా కాకుండా కొన్ని మార్పులతో రిలీజ్ అవుతున్నట్లు తెలుస్తోంది.ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సినిమా నిడివి విషయంలో కాస్త తేడా ఉందట.తెలుగు సినిమా రన్ టైం 2 గంటల 20 నిమిషాలు కాగా.హిందీ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలు ఉంటుందట.ఈ సినిమాకు సౌత్ లో జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ ఇస్తే.హిందీలో మిథున్ ఇచ్చాడట.తెలుగుతో పోల్చితే కొన్ని సీన్లను హిందీలో మార్చినట్లు తెలుస్తోంది.తెలుగులో బ్యాగ్రౌండ్ స్కోర్ తమన్ ఇస్తే.హిందీలో ఇది ఉండదట.