గ్లోబల్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) నటించిన మగధీర సినిమా ఎంతలా బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి రూపొందించాడు.
ఈ సినిమాతోనే రామ్ చరణ్ లైఫ్ టర్న్ అయింది.పైగా హీరోయిన్ కాజల్ కు కూడా ఈ సినిమానే కలిసి వచ్చింది.
ఇక ఇప్పటికీ టీవీలలో ఈ సినిమా వస్తే ప్రేక్షకులు అసలు మిస్ చేయరు.అందులో డైలాగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంటాయి.
ఇక ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళికి కూడా బాగా కలిసొచ్చిందని చెప్పాలి.అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలల్లో కదులుతూ ఉంటాయి.అందులో కాజల్ కోసం రామ్ చరణ్ చేసే కొన్ని సీన్స్ అద్భుతంగా ఉంటాయి.అయితే రామ్ చరణ్ విల్లన్ తో హార్స్ రైడ్ చేసినప్పుడు ఆ సమయంలో చరణ్ అదుపుతప్పి ఒక ఇసుకలో పడి మునిగిపోతూ ఉంటాడన్న సీన్ కూడా బాగా అద్భుతంగా ఉంటుంది.
అందులో గుర్రం వచ్చి రామ్ చరణ్ ను కాపాడే తీరు బాగా ఆకట్టుకుంటుంది.అయితే చాలామంది ఈ సీన్ రాజమౌళి అప్పుడే సృష్టించాడు అని అనుకున్నారు.కానీ ఇది కాపీ సీన్ అని గతంలో రాజమౌళి ( Rajamoul )మాటల ద్వారా బయటపడింది.గతంలో రాజమౌళి ఓ ఈవెంట్లో ఆ సీన్ గురించి మాట్లాడుతూ.
తను ఓసారి చిరంజీవి నటించిన కొండవీటిదొంగ సినిమా చూశాడట.అయితే ఆ సినిమాలో చిరంజీవి ఏదో కష్టంలో ఉంటే గుర్రం వచ్చి కాపాడిందని.
అయితే గుర్రం కాపాడిన తర్వాత చిరంజీవి, గుర్రం మధ్య కాపాడినట్టు ఎటువంటి ఇంటరాక్షన్ కనిపియలేదని.దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాను అని అన్నాడు.
అలా ఓ వ్యక్తి కానీ ఒక జంతువు కానీ కాపాడినప్పుడు వాటి మధ్య చూపించే ఇంటరాక్షన్ ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని తను మగధీర సినిమాలో ఆ సీన్ పెట్టాడని తెలిసింది.అందులో గుర్రం రామ్ చరణ్ ను కాపాడిన తర్వాత రామ్ చరణ్ గుర్రాన్ని హత్తుకొని ఎమోషనల్ అవ్వటంతో అక్కడ ఆ సీన్ హైలెట్ అయింది.అలా ఆ గుర్రం కాపాడిన సీన్ వెనుక ఇంత పెద్ద కథ నడిచిందని రాజమౌళి చెప్పడం ద్వారా తెలిసింది.
చాలా వరకు డైరెక్టర్ రాజమౌళి తను తీసే సినిమాలలో కొన్ని సన్నివేశాలు వెనుక చాలా లోతైన సమాధాన్ని చూపిస్తూ ఉంటాడు.
అందుకే ఆయన తీసే సినిమాలలో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి ఉంటాయి.ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలలో చాలా సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా.
ఏదైనా సమాధానం తెలిసే విధంగా ఉన్నాయని చెప్పాలి.ఇక ఏడాది కిందట ఆర్ఆర్ఆర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేశాడు.
ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు.