తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) ఇంటిలో తీవ్ర విషాదం నెలకొంది.భట్టి విక్రమార్క సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు( Mallu Venkateswarlu ) కన్నుమూశారు.
గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఎజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.మల్లు వెంకటేశ్వర్లు ఆయుష శాఖలో ప్రొఫెసర్ గా, అడిషనల్ డైరెక్టర్ గా పని చేసి ఉద్యోగ విరమణ పొందారు.
అలాగే వైరాలోని ఒకటోవ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియా వైద్యశాలను నిర్వహిస్తున్నారు.
గత మూడు నెలలుగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.చికిత్స పొందుతున్న ఆయనకు మూడు రోజుల కిందట గుండెపోటు( Heart Attack ) వచ్చింది.దీంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయంలో తుది శ్వాస విడిచారు.
కాగా మల్లు వెంకటేశ్వర్లు స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో అంత్యక్రియలను సాయంత్రం నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి సోదరుడు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఆయన సతీమణి నందినితో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.