సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలలో నటించి ఆ తర్వాత అవకాశాలు లేక కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో సినిమాల ఇండస్ట్రీకి దూరమైన వారు చాలామంది ఉన్నారు.అటువంటి వారిలో దగ్గుబాటి కుటుంబానికి చెందిన హీరో కూడా ఒకరు.
దగ్గుపాటి ఫ్యామిలీ( Daggubati Family ) నుంచి సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ఉన్నట్టుండి సినిమాలకు దూరమయ్యాడు.ఇంతకీ ఆ నటుడు ఎవరు? ప్రస్తుతం ఏమి చేస్తున్నాడు? అసలు ఏం జరిగింది? ఆ వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.తెలుగు సినిమా ఇండస్ట్రీలో దగ్గుపాటి ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.
ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ప్రొడ్యూసర్లుగా హీరోలుగా రాణిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.
హీరో వెంకటేష్, హీరో రానా హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే.రానా సోదరుడు అభిరామ్ ఇటీవల అహింస సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఈ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినది కేవలం వీరు మాత్రమే కాకుండా మరొక వ్యక్తి కూడా ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు.అతడు తెలుగు, తమిళం మలయాళం సినిమాల్లో నటించినప్పటికీ ఆ తర్వాత కాలంలో కనుమరుగయ్యారు.
ఆ నటుడు మరెవరో కాదు దగ్గుబాటి రాజా.( Daggubati Raja ) ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అతను, తమిళ మలయాళ సినిమాలలో నటించి మెప్పించాడు.మరి రాజాకి దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధం ఏంటి అనుకుంటున్నారా! మొఘల్ రామానాయుడు అన్న కొడుకే ఈ దగ్గుబాటి రాజా.దర్శకుడు భారతీరాజా దగ్గర నటనలో శిక్షణ పొందాడు.
తమిళంలో వరుస సినిమాలు చేస్తూ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.చూడగానే ఆకట్టుకునే రూపం, దగ్గుబాటి వారసత్వం.
దాంతో రాజా స్టార్ హీరో అవుతాడని అందరూ భావించారు.ఇక తెలుగులో కూడా సిరిపురం చిన్నోడు, ఝాన్సీ రాణి, చిన్నారి స్నేహం, వనిత, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.సినిమా అవకాశాలు తగ్గడంతో చెన్నై వెళ్లారు.అక్కడ తన తండ్రి దగ్గరకు వెళ్లి.ఆయన నిర్వహిస్తోన్న గ్రానైట్ వ్యాపారం బాగోగులు చూసుకోసాగాడు.ప్రస్తుతం భార్యాబిడ్డలతో కలిసి చెన్నైలోనే నివాసం ఉంటున్నాడు.
అయితే రాజా కున్న మొహమాటం వల్లే ఆయన ఇండస్ట్రీకి దూరం కావాల్సి వచ్చింది అంటారు అభిమానులు.ప్రసుత్తం వ్యాపారంలో రాణిస్తూ కోట్లు ఆర్జిస్తున్నారు రాజా.